రేపు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం? ఇది నిజమేనా? 

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు రేపు (జనవరి 16) న అంతరాయం కలుగుతుందని ప్రచారం జరుగుతోంది... ఇందులో నిజమెంత? 


జనవరి 16న అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగనుందనే ప్రచారం జరుగుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ టివి షో ది సింప్సన్ భవిష్యత్ విషయాలను అంచనా వేస్తుంది. ముఖ్యమైన గ్లోబల్ సంఘటనల వరకు చాలా విషయాల గురించి ఇది సరికొత్తగా టెలికాస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో జనవరి 16న ఇంటర్నెట్ సేవలకు అంతరాయం వుంటుందని ఈ షో తెలిపింది. 

ది సింప్సన్ ఊహాజనితంగా రూపొందించి ప్రసారంచేసే షో అభిమానులను ఆకట్టుకునేలా వుంటుంది. ఈ షోలోకి కొన్ని క్లిప్స్ మీమ్స్ గా బాగా పాపులర్ అయ్యాయి. ఈ షో సృష్టికర్తలను సరదాగా టైమ్ ట్రావెలర్స్ గా పేర్కొంటారు అభిమానులు. 
 
తాజాగా ఈ సింప్సన్ షో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జనవరి 16న అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయాల్సి వుందని... కానీ ఆయన ప్రమాణస్వీకారోత్సవాన్న జనవరి 20 కి మార్చుకున్నారని ఈ షోలో పేర్కొన్నారు. ఇంటర్నెట్ అంతరాయమే ఈ నిర్ణయానికి కారణం అనేలా సింప్సన్ షో ప్రసారం చేసింది. 

Latest Videos

ఇంటర్నెట్ సేవల కోసం సముద్రంలో భారీ కేబుల్స్ వుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓ సొరచేప ఈ కేబుల్స్ ను కొరికివేయడం వల్ల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయనేది ది సింప్సన్ ఫన్నీ రీజన్. ఇలా సరదాగా ప్రసారంచేసిన షో క్లిప్స్ ను ఎడిట్ చేసి కొందరు నిజంగానే రేపు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ను కలిగినవారు కూడా దీన్ని ప్రచారం చేస్తున్నారు. 

 

 

నిజంగానే సొరచేపల కారణంగా ఇంటర్నెట్ నిలిచిపోతుందా? 
 
ది సింప్సన్ షో సరదాగా ప్రసారం చేసినా నిజంగానే సొరచేపల వల్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుందా? అనే సందేహం చాలామందిలో మెదులుతోంంది. అయితే గతంలో సొరచేపలు నీటి అడుగున కేబుల్స్‌ను కొరకడం వల్ల చిన్న అంతరాయాలు ఏర్పడిన సందర్భాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్‌కు కీలకమైన ఈ కేబుల్స్‌లో అప్పుడప్పుడు సొరచేపలే కాకుండా ఇతర జలచరాలు కొరుకుతుంటాయి. కానీ ఈ కేబుల్స్ చాలా దృఢంగా వుండటంవల్ల పెద్ద సమస్యలేవీ తలెత్తవు. 

 

click me!