టీకాల తయారీలో భారత్ ప్రపంచానికే గొప్ప ఆస్తి : ఐక్యరాజ్యసమితి

By AN TeluguFirst Published Jan 29, 2021, 10:33 AM IST
Highlights

భారత్ ప్రపంచానికే గొప్ప ఆస్తి ఐక్యరాజ్యసమితి కొనియాడింది. కరోనా మహమ్మారిని అంతమొందించే పోరులో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన వాక్సినేషన్ లో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చారు. 

భారత్ ప్రపంచానికే గొప్ప ఆస్తి ఐక్యరాజ్యసమితి కొనియాడింది. కరోనా మహమ్మారిని అంతమొందించే పోరులో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన వాక్సినేషన్ లో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చారు. 

భారీ స్థాయిలో టీకాలు తయారు చేయడంలో భారత్ సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తి అని అభివర్ణించారు. భారత్ లో దేశీయంగా అనేక టీకాలు తయారవుతున్న విషయం తమకు తెలుసని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ సంస్థలతో ఐక్యరాజ్యసమితి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉందని తాము భావిస్తున్నామన్నారు. కరోనా టీకా ప్రపంచదేశాలకు వీలైనంత త్వరగా చేరేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాల తయారీ లైసెన్స్ లను ఆయా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

భారత్ ఇప్పటివరకు 55 లక్షల డోసులను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు బహుమానంగా పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ ను రూపుమాపడంలో భారత్ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్యసమితి ఇలా వ్యాఖ్యలు చేయడం విశేషం. 

త్వరంలో కరేబియన్ దేశాలతో పాటు, ఒమన్, నికరాగ్వా, పసిఫిక్ ద్వీప దేశాలకు సైతం టీకా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం తెలిపారు. అలాగే ఆఫ్రికా దేశాలకు ప్రత్యేకంగా కోటి డోసులన్ని, ఐరాసకు 10 లక్షల డోసుల్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. 
 

click me!