ఐదేళ్లకే కారు నడిపిన బాలుడు.. తల్లిదండ్రుల కోసం పోలీసుల వేట

By Siva KodatiFirst Published Jan 28, 2021, 4:08 PM IST
Highlights

పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష తల్లిదండ్రులదే. ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు పాకిస్తాన్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. ముల్తాన్‌‌లోని  రహదారిలో ఓ ఐదేళ్ల బాలుడు బ్లాక్‌ టయోట కారు నడుపుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 

పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష తల్లిదండ్రులదే. ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు పాకిస్తాన్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. ముల్తాన్‌‌లోని  రహదారిలో ఓ ఐదేళ్ల బాలుడు బ్లాక్‌ టయోట కారు నడుపుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో ఆ బాలుడు స్టీరింగ్‌ ఎదురుగా నిలబడి బిజీ రోడ్డుపై అతి వేగంగా కారు నడుపుతూ కనిపించాడు. ఈ కారులో ఆ బాలుడు తప్ప పెద్దవారు ఎవరూ లేకపోవడం విస్మయం కలిగిస్తోంది.

ఈ వీడియో ఆ నోటా ఈ నోటా పోలీసుల కంటపడింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. ఆ బాలుడి వల్ల జరగరానిదే ఏదైనా జరిగితే ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతే ఆ బాలుడు చేసిన తప్పుకు బాధ్యత తల్లిదండ్రులదేనని ఫిక్సయ్యారు. వీరిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది

కాగా చీఫ్‌ ట్రాఫిక్‌ ఆఫీసర్‌ జాఫర్‌ బుజ్గార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆ చిన్నారితో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసిన బాలుడి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అయితే ఐదేళ్ల చిన్న వయసులోనే కారు నడపడానికి అనుమతి ఇచ్చిన అతడి తల్లిదండ్రులపై నెటిజన్‌లు భగ్గుమంటున్నారు. తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనమని... అతడితో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ఈ బాలుడి తల్లిదండ్రులు ప్రమాదంలో పడేశారంటూ విమర్శిస్తున్నారు.

click me!