Maldives: భారత బలగాలు మే నెలలోపు వెళ్లిపోవాల్సిందే.. : మాల్దీవ్స్ అధ్యక్షుడు

By Mahesh KFirst Published Feb 5, 2024, 2:46 PM IST
Highlights

మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరిని మరోసారి ఆ దేశ పార్లమెంటులో వ్యక్తపరిచాడు. మాల్దీవుల నుంచి భారత బలగాలు మే 10వ తేదీలోపు వెళ్లిపోతాయని, ఈ మేరకు ఉభయ దేశాల మధ్య అవగాహన ఏర్పడిందని వివరించాడు.
 

Maldives: మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జు తన భారత వ్యతిరేక వైఖరికే కట్టుబడి ఉన్నాడు. పార్లమెంటులో మరోసారి భారత బలగాల గురించి మాట్లాడాడు. మాల్దీవుల సార్వభౌమత్వంలో ఏ దేశమైనా జోక్యం చేసుకోవడాన్ని అనుమతించబోమని, తమ సార్వభౌమత్వాన్ని పలుచన చేసే చర్యలనూ అంగీకరించబోమని చెప్పాడు. భారత బలగాలు మే 10లోపు వెళ్లిపోతాయని స్పష్టం చేశాడు. భారత్, మాల్దీవులు ఈ విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చాయని చెప్పినట్టు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

మాల్దీవుల్లోని మూడు వైమానిక వేదికల్లో ఒక ప్లాట్‌ఫామ్ నుంచి భారత బలగాలు మార్చి 10లోపు వెళ్లిపోతాయని అధ్యక్షుడు ముయిజ్జు చెప్పాడు. ఇక మిగిలిన రెండు ప్లాట్‌ఫామ్‌ల పై నుంచీ మే 10 లోపు వెళ్లిపోతాయని వివరించాడు. భారత్‌తో మాల్దీవుల జలాలకు సంబంధించిన ఈ అగ్రిమెంట్‌ను ఇక ముందు కొనసాగించబోమని స్పష్టం చేశాడు.

మాల్దీవుల అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జు ఈ మేరకు పార్లమెంటులో ప్రసంగించారు. కాగా, ప్రతిపక్ష పార్టీలు ఎండీపీ, డెమోక్రాట్లు ముయిజ్జు ప్రసంగాన్ని బహిష్కరించాయి. ప్రెసిడెంట్ ముయిజ్జు ప్రసంగాన్ని కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే ఆలకించారు. కాగా, 56 మంది ఎంపీలు ఆయన ప్రసంగాన్ని స్కిప్ చేశారు.

Also Read : రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ... పూర్తి పాట, రాసింది ఎవరంటే..

ఇదిలా ఉండగా.. అధ్యక్షుడు ముయిజ్జుపై అభిశంసన తీర్మానానికి ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముయిజ్జును తప్పించాలనే పనిలో నిమగ్నం అయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఈ విషయం పై స్పష్టత రానుంది.

click me!