హైజాక్‌కు గురైన ఇరాన్ నౌకను భారత నావికాదళం రక్షించింది. ఈ నౌక నుండి 23 మంది పాకిస్తానీయులను కాపాడారు.
న్యూఢిల్లీ:భారత నావికాదళం శుక్రవారం నాడు అరేబియా సముద్రంలో 12 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత సోమాలియా సముద్రపు దొంగల నుండి 23 పాకిస్తానీ పౌరులను రక్షించింది భారత నావికాదళం.
గల్ఫ్ ఆఫ్ ఏడేన్ సమీపంలో ఇరాన్ మత్స్యకార నౌకపై సముద్రపు దొంగల దాడిపై భారత నావికాదళం వేగంగా స్పందించింది.ఈ మేరకు ఇండియన్ నేవీ ఓ ప్రకటనను విడుదల చేసింది. హైజాక్ కు గురైన నౌక నుండి 23 మంది పాకిస్తానీ పౌరులను రక్షించినట్టుగా భారత నేవీ ప్రకటించింది.
undefined
ఈ నెల 28 సాయంత్రం ఇరాన్ ఫిషింగ్ ఓడ ఆల్ కంబార్ 786 లో సముద్రపు దొంగల గురించి ఇండియన్ నేవీకి సమాచారం అందింది.హైజాక్ అయిన ఫిషింగ్ ఓడను అడ్డుకొనేందుకు అరేబియా సముద్రంలో మోహరించిన రెండు నౌకలను ఇండియన్ నేవీ మళ్లించింది.
సోకోట్రాకు దాదాపు 90 నాటికన్ మైళ్ల నైరుతి దిశలో నౌక ప్రయాణీస్తున్న సమయంలో సముద్రపు దొంగలు నౌకలో ప్రవేశించినట్టుగా నివేదికలు వెల్లడించాయి. ఈ నెల 29న హైజాక్ అయిన నౌకను భారత నావికాదళ సిబ్బంది రక్షించినట్టుగా నేవీ ప్రకటించింది.
ఇటీవలి నెలలో గల్ఫ్ ఏడెన్ సమీపంలో వ్యాపార నౌకలపై దాడులు పెరగడంతో ఇండియన్ నేవీ తన నిఘాను పెంచింది.ఈ ఏడాది జనవరి 5న సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు హైజాక్ చేసింది. ఈ నౌకను భారత నేవీ రక్షించింది.