దక్షిణాఫ్రికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందారు.ఈ ప్రమాదం నుండి ఎనిమిదేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడ్డారు.
జోహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో గురువారం నాడు ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది.ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. బోట్సావానా నుండి మోరియాకు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం నుండి ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలతో బయపటడింది. ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈశాన్య లింపోపో ఫ్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
జోహాన్స్‌బర్గ్ కు ఉత్తరాన 300 కి.మీ. దూరంలోని మోకోపానే, మార్కెన్ మధ్య పర్వత మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మార్గంలో వంతెన పై నుండి బస్సు లోయలో పడింది. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని రవాణాశాఖ అధికారులు ప్రకటించారు.165 లోతులో ఉన్న లోయలో బస్సు పడిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలాన్ని రవాణా శాఖ మంత్రి సింధిసివే పరిశీలించారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలిపారు.