అన్నా చెల్లి పెళ్లి: ఎందుకో తెలిస్తే షాకవుతారు

By narsimha lodeFirst Published Jan 31, 2019, 8:11 PM IST
Highlights

అస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు  అన్నా చెల్లెళ్లు భార్యా,భర్తలుగా ఆడిన పెళ్లి నాటకం బట్టబయలైంది. నకిలీ పత్రాలతో భార్య, భర్తలుగా నాటకం ఆడుతున్న  వీరి బాగోతం బట్టబయలైంది.

న్యూఢిల్లీ: అస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు  అన్నా చెల్లెళ్లు భార్యా,భర్తలుగా ఆడిన పెళ్లి నాటకం బట్టబయలైంది. నకిలీ పత్రాలతో భార్య, భర్తలుగా నాటకం ఆడుతున్న  వీరి బాగోతం బట్టబయలైంది.

ఈ అన్నా చెల్లెళ్లకు చెందిన బాగోతాన్ని పంజాబ్‌కు చెందిన  ఓ మహిళ బయటపెట్టింది. తన పేరుతో ఫోర్జరీ పత్రాలను సృష్టించి అన్నా చెల్లెళ్లు భార్య, భర్తలుగా చలామణి అవుతున్నారని బాధితురాలు పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విషయాన్ని అస్ట్రేలియా వార్తా సంస్థ ఎస్‌బీఎస్ డాట్ కామ్ ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలోని బధిండా జిల్లాలోని బాలియన్‌వాలా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరితో పాటు ఆరుగురు కుటుంబసభ్యుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఉంటున్న నిందితుడు తన సోదరిని కూడా అక్కడికి తీసుకెళ్లేందుకు ఈ నాటకం ఆడాడు.సోదరిని తన సమీప బంధువు పేరుతో నకిలీ పత్రాలను సృష్టించాడరు. వీటితో గురుద్వారా వివాహ దృవీకరణ పత్రాన్ని  తీసుకొన్నారు. దీని ద్వారా తమ పెళ్లిని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయించారని పంజాబ్ పోలీసులు తెలిపారు.ఈ ఘటన 2012లో వెలుగులోకి వచ్చింది, ప్రస్తుతం నిందితులిద్దరూ కూడ అస్ట్రేలియాలో ఉన్నారని పోలీసులు చెప్పారు. 

click me!