మాల్దీవుల్లో ఇండియా వర్సెస్ చైనా.. ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ముందుకు.. ఎందుకంటే?

By Mahesh K  |  First Published Sep 6, 2023, 2:48 PM IST

మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ఫారీన్ పాలసీ ప్రధాన ఎజెండాగా మారింది. ఇండియానా? చైనానా? అనేదే ప్రధానంగా వినిపించింది. ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ ఇండియా ఫస్ట్ అని నినాదమిచ్చారు. పోటీలోని మొహమ్మద్ మయిజ్జూ మాత్రం ఇండియా ఔట్ అని చైనాకు అనుకూలంగా ప్రచారం చేశారు.
 


న్యూఢిల్లీ: పర్యాటకానికి మారుపేరుగా ఉండే మాల్దీవుల్లో ఇప్పుడు ఇండియా వర్సెస్ చైనాగా వాదనలు నడుస్తున్నాయి. ఇండియా వైపా? చైనా వైపా? అన్నట్టుగా చర్చ నడుస్తున్నది. మాల్దీవులు ఏ దేశం వైపు ఉండాలి? ఏ దేశానికి సన్నిహితంగా ఉండాలనేదే ప్రధాన ఎజెండగా ఉన్నది. 

మాల్దీవుల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 9వ తేదీన జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఇండియా వర్సెస్ చైనా అన్నట్టుగా కామెంట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ ఇండియా ఫస్ట్ నినాదాన్ని ఇస్తుండగా.. పోటీగా ఉన్న మొహమ్మద్ మయిజ్జూ ఇండియా ఔట్ అని పిలుపు ఇచ్చారు. తద్వార చైనాకు విశ్వసనీయంగా ఉండాలనే వ్యాఖ్యలు చేశారు.

Latest Videos

5,21,000 జనాభాగల మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటకంపైనే ఆధారపడి ఉన్నది. ఈ దేశంలో మౌలిక సదుపాయాల కోసం భారత్, చైనా రెండూ ఆర్థికంగా సహకరిస్తున్నాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. భౌగోళికంగా దక్షిణాసియాలో చైనా ప్రాబల్యానికి అడ్డుగా భారత్ ఉన్నది. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని భారత్ అడ్డుకుంటున్నది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్‌తో భారీగా పెట్టుబడులు పెట్టి.. అప్పులు ఇచ్చి ఆయా దేశాలను చైనా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే మాల్దీవులను కూడా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని చైనా ఉబలాటపడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాలు మాల్దీవులపై ఫోకస్ పెట్టాల్సి వస్తున్నది.

Also Read: 60 ఏళ్ల వృద్ధురాలిపై కర్రతో విచక్షణారహిత దాడి.. 50 సార్లు కొట్టిన దుండగుడు.. వీడియో వైరల్

ఈ భౌగోళిక రాజకీయమే మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తుండటం గమనార్హం. 

ఇబ్రహీం మొహమ్మద్ భారత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ సంక్షోభం వచ్చిన మొదటగా స్పందించి ఆదుకునేది భారత దేశమని అంటున్నారు. తమ మద్దతు దేశంగా భారత్‌ను కొనియాడుతున్నారు. కాగా, మయిజ్జూ మాత్రం మాల్దీవుల సార్వభౌమాధికారానికి భారత్ ముప్పు కలిగిస్తున్నదని, శాశ్వత మిలిటరీ బేస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇండియా ఖండించింది. మాల్దీవుల దళాల కోసమే నేవీ నౌకాశ్రయాన్ని నిర్మించడానికి సహకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. మాల్దీవుల్లో పాగా వేసి భారత పై నిఘా వేయడానికి చైనా ప్రయత్నిస్తున్నది. కానీ, మయిజ్జూ మాత్రం భారత వ్యతిరేక అజెండాతో క్యాంపెయిన్ చేస్తున్నారు.

click me!