నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 29మంది సజీవ దహనం..

By Rajesh Karampoori  |  First Published Apr 3, 2024, 9:37 AM IST

Istanbul Nighclub Fire: ఇస్తాంబుల్ లోని ఓ నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 29 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విచారణ నిమిత్తం కొందరిని అదుపులోకి తీసుకున్నారు. 


Istanbul Nighclub Fire: టర్కీలోని ఇస్తాంబుల్‌ నైట్ క్లబ్‌లో మంటలు చెలరేగాయి. నైట్ క్లబ్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో 29 మంది మరణించినట్లు తెలుస్తోంది. క్లబ్ నిర్వాహకులతో పాటు పలువురిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం అధికారులు , అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. నైట్‌క్లబ్‌లో పునరుద్ధరణ పనుల్లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో 29 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఎనిమిది మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చేరినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనడోలు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇస్తాంబుల్‌లోని యూరోపియన్ భాగంలోని బెసిక్టాస్ జిల్లాలోని నైట్‌క్లబ్ పునర్నిర్మాణం కోసం మూసివేయబడింది.
 
ఇస్తాంబుల్ గవర్నర్ దావత్ గుల్ సంఘటనా స్థలానికి చేరుకుని మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని, బాధితులు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమై ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. అలాగే.. న్యాయ శాఖ మంత్రి యిల్మాజ్ టున్‌క్ మాట్లాడుతూ అధికారులు ఐదుగురు వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారని, ఇందులో క్లబ్ నిర్వాహకులు ఉన్నారని తెలిపారు. భవనం భద్రతను అంచనా వేయడానికి అధికారులు మొత్తం భవనాన్ని తనిఖీ చేస్తున్నారని మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లు తెలిపారు. ఘటనా స్థలానికి పలు అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలను రప్పించామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులుగా క్లబ్ మేనేజర్ సహా 6 మందిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

click me!