‘‘ సమానత్వం ఏది ’’.. COP28 కంటే ముందే ...క్లైమేట్ జస్టిస్‌ను లేవనెత్తిన భారత పర్యావరణ మంత్రి

Siva Kodati |  
Published : Dec 04, 2023, 06:09 PM IST
‘‘ సమానత్వం ఏది ’’.. COP28 కంటే ముందే ...క్లైమేట్ జస్టిస్‌ను లేవనెత్తిన భారత పర్యావరణ మంత్రి

సారాంశం

ఇటీవల యూఏఈలో జరిగిన COP28 సమ్మిట్‌కి ముందు భారత పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ క్లైమేట్ జస్టిస్ అనే క్లిష్టమైన భావనను నొక్కిచెప్పారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్ క్లైమేట్ ఫర్ బిజినెస్ (క్లైమ్‌బి) ఫోరమ్ చివరి సెషన్‌లో ఆయన పాల్గొన్నారు.

ఇటీవల యూఏఈలో జరిగిన COP28 సమ్మిట్‌కి ముందు భారత పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ క్లైమేట్ జస్టిస్ అనే క్లిష్టమైన భావనను నొక్కిచెప్పారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్ క్లైమేట్ ఫర్ బిజినెస్ (క్లైమ్‌బి) ఫోరమ్ చివరి సెషన్‌లో ఆయన మాట్లాడుతూ.. తలసరి ఉద్గారాలలో అసమానతను ఎత్తిచూపారు . "అభివృద్ధి చెందిన దేశాలలోని 17 శాతం మంది తలసరి ఉద్గారాలను 60 శాతం కలిగి వుంటే.. 54 ఆఫ్రికన్ దేశాల్లో అది కేవలం 4 శాతం మాత్రమేనని చెప్పారు.

అందరికీ గౌరవప్రదమైన జీవితాల ఆవశ్యకతను భూపేందర్ నొక్కిచెప్పారు. కాప్ 28 కోసం తాను ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని.. గ్లోబల్ స్టాక్‌టేక్ రిజల్ట్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పానని కేంద్ర మంత్రి పేర్కొననారు. గ్లోబల్ అడాప్టేషన్ ప్రాక్టీసుల కోసం నిధులను పెంచాలని చెబుతూనే, అడాప్టేషన్‌పై గ్లోబల్ గోల్‌ను స్వీకరించాల్సిందిగా కోరారు. 

క్లైమ్‌బి ఫోరమ్ సమావేశాన్ని.. దుబాయ్‌లో జరగనున్న కాప్ 28 సమ్మిట్ సందర్భంగా వ్యూహాత్మకంగా నిర్ణయించారు. క్లైమేట్ లీడర్‌షిప్, క్లీన్ ఎనర్జీ, పాలసీ స్ట్రాటజీలు, గ్రీన్ ఫైనాన్సింగ్‌ల కలయికను ఇది పరిశోధించింది. వాతావరణ మార్పుల సుదూర ప్రభావాలను పరిష్కరించడంలో సాంకేతికత, ఆవిష్కరణల కీలకపాత్రను గుర్తిస్తూ స్థిరమైన ఆర్ధిక వృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. 

అంతకుముందు రోజు.. కామన్వెల్త్ సెక్రటరీ-జనరల్ హాన్ ప్యాట్రిసియాజ స్కాట్లాండ్ వాతావరణ మార్పు వల్ల హాని కలిగించే దేశాలకు అస్తిత్వ ముప్పును హైలైట్ చేశారు. 1.5-డిగ్రీల లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కిచెప్పారు.  డొమినికాలో మారియా హరికేన్ సృష్టించిన విధ్వంసం వంటి వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ప్రజల జీవితాలు,  జీవనోపాధిపై వాతావరణ మార్పు తీవ్ర ప్రభావాన్ని హాన్ నొక్కి చెప్పారు. స్కాట్లాండ్.. వాతావరణ సంక్షోభానికి ప్రపంచ ప్రతిస్పందనను ప్రశ్నించింది. దీనిని COVID-19 మహమ్మారి సమయంలో ప్రదర్శించిన ఆవశ్యకతతో పోల్చి, వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఆవశ్యకత, కఠినత శక్తి యొక్క అవసరాన్ని నొక్కి చెప్పింది.

క్లైమేట్ ఫైనాన్సింగ్‌కు సంబంధించిన సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న వివక్షలు, పునరావృతమయ్యే సమస్యలు, మూలధనాన్ని పొందడంలో ప్రపంచ అసమానతలను పరిష్కరించడంలో అవసరాన్ని వక్తలు చర్చించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ సంబంధిత కార్యక్రమాలకు అవసరమైన వంద బిలియన్ డాలర్ల గురించి చర్చ జరిగింది. ఇండియా గ్లోబల్ ఫోరమ్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా 2023 కార్యక్రమంలో భారతదేశం, యుఎఇ , ఆఫ్రికా నుండి వ్యాపార నాయకులు, విధాన రూపకర్తలు వృద్ధికి అవకాశాలను చర్చించడానికి ఒక వేదికను అందించింది. ఈ చర్చలు వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణ, సాంకేతికత , స్థిరత్వంతో సహా అనేక అంశాలను కవర్ చేశాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే