Safina Namukwaya : కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు.. అత్యంత వృద్ధ తల్లిగా రికార్డు..

By Asianet NewsFirst Published Dec 2, 2023, 12:09 PM IST
Highlights

Uganda Twin Child : 70 ఏళ్ల వయస్సులో ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్దలు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఐవీఎఫ్ పద్దతి ద్వారా ఆమె ఈ వయస్సులో గర్భం దాల్చింది. ఈ వార్త ప్రస్తుతం నెటింట్లో వైరల్ గా మారింది.

Ugandan woman : ఉగాండాకు చెందిన మహిళ 70 ఏళ్ల వయస్సులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆమె  ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తల్లుల్లో ఒకరిగా రికార్డులకు ఎక్కింది. సాధారణంగా 40 ఏళ్లు దాటితో సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఆమె 70 ఏళ్ల వయస్సులోనూ ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం, తల్లీ, బిడ్డలు సురక్షితంగా ఉండటం చాలా అరుదుగానే జరుగుతాయి. 

T Raja Singh : బీజేపీతో టచ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం - రాజాసింగ్

వివరాలు ఇలా ఉన్నాయి. సఫీనా నముక్వాయా వయస్సు ప్రస్తుతం 70 సంవత్సరాలు. ఆమెకు గతంలో గర్భస్రావం జరిగింది. 1992లో ఆమె తన భర్తను కోల్పోయింది. నాలుగేళ్ల తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే సఫీనా నముక్వాయా సంతానం కలుగలేదు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. దీంతో డాక్టర్లను సంప్రదించింది. 

A 70-year-old woman has given birth to twins following IVF treatment, a hospital in Uganda has said.

Safina Namukwaya delivered a boy and a girl via caesarean at a fertility centre in the capital, Kampala. pic.twitter.com/XjGBgbkGPV

— The Instigator (@Am_Blujay)

అయితే డాక్టర్లు ఆమెను పరీక్షించారు. ఇన్‌ విట్రో ఫర్టిలైజేషన్ పద్దతి (ఐవీఎఫ్) ద్వారా సంతానం కలిగేలా చేయవచ్చని తెలిపారు. దీనికి సఫీనా నముక్వాయా అంగీకరించారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఐవీఎఫ్ పద్దతి ద్వారా గర్భం దాల్చింది. తాజాగా సీ- సెక్షన్ ద్వారా ఆమె ఇద్దరు కవల పిల్లలకు సురక్షితంగా జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు పాప కాగా.. మరొకరు బాబు ఉన్నారు. 

DK Shivakumar : ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొద్దు.. కర్ణాటకలో ఏం జరిగిందో అందరికీ తెలుసు - డీకే శివ కుమార్

కాగా.. ఆమె 34 వారాలా గర్భంతో ఉన్నప్పుడు ఓ మీడియా సంస్జతో మాట్లాడారు. తనకు కవల పిల్లలు జన్మించబోతున్నారని తెలిసినప్పుడు కొంత ఇబ్బంది పడ్డానని అన్నారు. ఇద్దరు పిల్లల కడుపులో మోయడం వల్ల చాలా అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. తన సేవింగ్స్ అన్నీ ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశానని చెప్పారు. ఆ సమయంలో డాక్టర్లు తనకు అందించిన మద్దతు వెలకట్టలేదని చెప్పారు. కాగా.. ఈ వయస్సు గర్భం దాల్చిన ఆఫ్రికా తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. 2019లో భారత్ కు చెందిన యర్రమట్టి మంగాయమ్మ 73 ఏళ్ల వయస్సులో కవల పిల్లలకు జన్మనిచ్చింది.

click me!