వార్నీ.. పెన్షనర్ మృతదేహాన్ని రెండేళ్లు ఫ్రీజర్లో ఉంచి.. అతడి బ్యాంక్ కార్డులను షాపింగ్ కు ఉపయోగించిన వ్యక్తి

By Asianet News  |  First Published May 4, 2023, 1:29 PM IST

పెన్షనర్ మృతదేహాన్ని ఓ వ్యక్తి రెండేళ్ల పాటు ఫ్రీజర్లో భద్రపర్చి, అతడి బ్యాంక్ కార్డులను ఉపయోగించుకున్నాడు. షాపింగ్ చేసేందుకు వాడుకున్నాడు. అలాగే ఆ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి డబ్బులు కూడా డ్రా చేసుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 


ఓ వ్యక్తి పెన్షనర్ మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్లో ఉంచాడు. అతడికి సంబంధించిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి షాపింగ్ చేశాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు అతడికి అరెస్ట్ చేశారు. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. నిందితుడు ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చాడు.

బజరంగ్ దళ్ నిషేధం విషయంలో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ? అలాంటి ప్రతిపాదనేమీ పార్టీకి లేదన్న వీరప్ప మొయిలీ

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. యూకేకు చెందిన 71 ఏళ్ల జాన్ వెయిన్ రైట్, 52 ఏళ్ల డామియన్ జాన్సన్ ఓకే ఫ్లాట్ లో కలిసి ఉండేవారు. వీరిద్దరు హామ్ డౌన్ టౌన్ క్లీవ్ ల్యాండ్ టవర్, హోలీవెల్ హెడ్ లోని ఒక ఫ్లాట్ కలిసి జీవించేవారు. అయితే అందులో వెయిన్ రైట్ కు పెన్షన్ వస్తుండేది. ఈ క్రమంలో ఆయన 2018 సెప్టెంబర్ లో మరణించాడు. అయితే ఈ విషయం అతడి రూమ్ మేట్ ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాడు. ఓ ఫ్రీజర్ తీసుకొచ్చి, ఆ డెడ్ బాడీని అందులోనే భద్రపర్చాడు.

హింసాత్మక ఘర్షణలతో మండిపోతున్న మణిపూర్.. సాయం చేయాలంటూ మేరీ కోమ్ ట్వీట్.. అసలేం జరుగుతోందంటే ?

తరువాత అతడి బ్యాంకు సంబంధించిన కార్డులను ఉపయోగించి షాపింగ్ చేసేవాడు. ఏటీఎంల ద్వారా డబ్బును డ్రా చేసేవాడు. అయితే జాన్ వెయిన్ రైట్ మరణించిన విషయం 2020 ఆగస్టు 22వ తేదీన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టులో విచారణ జరిగింది. తాజాగా తీర్పు వెలువడింది. అయితే తాను షాపింగ్ చేసిన డబ్బు తనదేనని కోర్టులో డామియన్ వాదించాడు. 

ఇలాంటి రోజులు చూడటానికేనా మేము పతకాలు గెలిచింది ? - వినేశ్ ఫోగట్.. ఏడుస్తూ మీడియాతో మాట్లాడిన రెజ్లర్..

తాము ఇద్దరం జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరిచామని, ఎప్పుడైనా ఆ డబ్బు తాను ఉపయోగించుకునే అర్హత ఉందని చెప్పారు. ఆ డబ్బు సాకేంతికంగా తనకే చెందుతుందని పేర్కొన్నారు. దీనికి కోర్టు ఏకీభవించింది. కానీ వెయిన్ రైట్ ను చట్టబద్ధంగా, మర్యాదగా ఖననం చేయకుండా అడ్డుకున్నారనే అభియోగాన్ని అంగీకరించారు. దీంతో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అనంతరం బెయిల్ మంజూరు చేసింది. 

click me!