Russia Ukraine Crisis: దేవుని కోస‌మైనా...ఈ ఊచకోతను ఆపండి: పోప్ ఫ్రాన్సిస్

Published : Mar 14, 2022, 03:52 AM IST
Russia Ukraine Crisis: దేవుని కోస‌మైనా...ఈ ఊచకోతను ఆపండి: పోప్ ఫ్రాన్సిస్

సారాంశం

Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో రష్యా బలాగాలు చిన్న పిల్లల ఆసుపత్రులు, సామాన్య ప్రజలపై బాంబులు కురిపించడం ఆటవిక, పైశాచిక చర్య అని తెలిపారు. ఆమోదయోగ్యం కానటువంటి ఈ నరమేధాన్ని దేవుని కోసం  ఆపాలని కోరారు. వీక్లీ ప్రేయర్స్ సందర్భంగా ఆయన ఈ పిలుపునిచ్చారు.   

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని పోప్ ఫ్రాన్సిస్ మరోసారి ఖండించారు, పిల్లల ఆసుపత్రులు,  పౌరుల లక్ష్యాలపై బాంబు దాడి చేయడం అనాగరిక చర్య అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేవుని పేరిట... ఈ మారణకాండను ఆపండని పోప్ అన్నారు. వీక్లీ ప్రేయర్స్ సందర్భంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. చర్చలపై నిజమైన, నిర్ణయాత్మకమైన దృష్టి సారించాలని కోరారు. మానవత దృప‌థంతో  కారిడార్ లను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లించాల‌ని కోరారు. రోమ్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సండే బ్లెస్సింగ్ సందర్భంగా వేలాది మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 

రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య పోరు 18వ రోజుకు చేరుకుంది. ఉక్రేనియన్ నగరాలు స్మశానవాటికలుగా మారాయ‌ని పోప్ అన్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్య‌ దాడిని తక్షణమే ముగించాలని పోప్ రష్యాకు పిలుపునిచ్చారు. ర‌ష్యా సైనిక చ‌ర్య‌ను పోప్ ఖండించ‌డం ఇది రెండోసారి. మార్చి 6న ఓ స‌మావేశంలో పోప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో రక్తం, కన్నీళ్లు ఏరులై పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించాలని రష్యాకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు.  ‘ఉక్రెయిన్‌లో రక్తం, కన్నీళ్ల నదులు ప్రవహిస్తున్నాయి. ఇది సైనిక చర్య మాత్రమే కాదు.. మరణం, విధ్వంసం, దుఃఖానికి దారితీసే యుద్ధం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, సున్నితమైన అంశాలలో సైలెంట్‌గా దౌత్యం నెరిపే చరిత్ర వాటికన్‌కు ఉన్నది. దురాక్రమణలపై పక్షపాతం వహించకుండా చర్చలు జరుపుతుందన్న నమ్మకాన్ని పెంపొందించుకుంది. ఈ నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ గత వారం వాటికన్‌ సిటీ నుంచి కాలు బయటపెట్టి రష్యా రాయబారిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎలాంటి చర్చలు జరిపారన్నది వెల్లడికాలేదు. కానీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి పోప్‌ ఫ్రాన్సిన్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ లో మ‌ర‌ణ‌హోం జ‌రుగుతోంది. లివివ్‌లోని ఉక్రెయినియన్ మిలిటరీ బేస్‌పై రష్యా దాడిలో కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోయారు, సుమారు 134 మంది గాయపడ్డారని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది ప్రజలు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోతున్నారు. ఆ దేశంలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాంతీయ గవర్నర్ Maksym Kozytskyy ప్రకారం.. దాదాపు 30 రాకెట్ల దాడులు జ‌రిగిన‌ట్టు ఆరోపణలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే