షాక్: కన్నతల్లి ముందే కొడుకు తల కోశాడు

Published : Feb 11, 2019, 04:40 PM IST
షాక్: కన్నతల్లి ముందే  కొడుకు తల కోశాడు

సారాంశం

 కన్నతల్లి కళ్ల ముందే  ఓ టాక్సీ డ్రైవర్  ఆమె ఆరేళ్ల కొడుకుపై గాజు ముక్కతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ బాలుడి తల ఎగిరిపడింది. తన కొడుకును కాపాడుకొనేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం వృధాగా మారింది.

మదీనా: కన్నతల్లి కళ్ల ముందే  ఓ టాక్సీ డ్రైవర్  ఆమె ఆరేళ్ల కొడుకుపై గాజు ముక్కతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ బాలుడి తల ఎగిరిపడింది. తన కొడుకును కాపాడుకొనేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం వృధాగా మారింది.  ఈ ఘటన మదీనాకు సమీపంలో చోటు చేసుకొంది.

ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు జకారియాతో కలిసి టాక్సీలో  మహ్మద్ ప్రవక్త పవిత్ర క్షేత్రం మదీనాకు బయలు దేరింది. అయితే  టాక్సీ డ్రైవర్ మద్యలోనే కారును ఆపి కారులో కూర్చొన్న ఆరేళ్ల బాలుడిని బలవంతంగా బయటకు లాగి గాజు ముక్కతో ఆ బాలుడిపై దాడి చేశారు.

ఈ దాడిలో ఆ బాలుడి తల అక్కడికక్కడే తెగిపడింది.అయితే తన కొడుకును కాపాడుకొనేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నాలు చేసింది. కానీ, ఆమె తన  కొడుకును కాపాడుకోలేకపోయింది.

శుక్రవారం నాడు మదీనాలో ఈ ఘటన చోటు చేసుకొన్నట్టుగా మీడియా ప్రకటించింది.  టాక్సీ డ్రైవర్ నుండి బాలుడిని రక్షించేందుకు కూడ పోలీసులు అక్కడికి చేరుకొనేలోపుగా  నిందితుడు ఆ బాలుడిని చంపేశాడు.  ఇదిలా ఉంటే  టాక్సీ డ్రైవర్ మానసిక సమస్యతో బాధపడుతున్నట్టుగా చెబుతున్నారు.  నిందితుడిని అదుపులోకి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Gold : టీ తాగిన రేటుకే తులం బంగారం.. ఈ దేశం పేరు తెలిస్తే షాక్ అవుతారు !
Coca Cola Formula : 100 ఏళ్ల కోకా కోలా తయారీ సీక్రేట్ లీక్..? ఏకంగా యూట్యూబ్ లో వీడియో