ఇలా పరిష్కారం కాదు: కాశ్మీర్ పై ఇమ్రాన్ మెలిక

By narsimha lodeFirst Published Jul 23, 2019, 12:45 PM IST
Highlights

కాశ్మీర్ సమస్యలను ద్వైపాక్షిక సమస్య ద్వారా పరిష్కారం కాదని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్  స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. 

వాషింగ్టన్ : కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికంగా పరిష్కరించలేమని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.

కాశ్మీర్ సమస్యపై తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.కాశ్మీర్ సమస్యపై  ట్రంప్ ను మధ్యవర్తిత్వం వహించాలని  ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరినట్టుగా ట్రంప్ చెప్పడాన్ని ఇండియా ఖండించింది.

 మూడు రోజుల అధికారిక పర్యటన కోసం పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అమెరికాకు వచ్చారు.ఈ సందర్భంగా ఓ మీడియా చానెల్‌తో ఇమ్రాన్ మాట్లాడారు. ద్వైపాక్షికంగా ఈసమస్యను పరిష్కరించలేమని ఆయన ప్రకటించారు. 

వాజ్‌పేయ్, నవాజ్‌ షరీఫ్‌లు జమ్మూ కాశ్మీర్ సమస్యపై తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సిమ్లా, లాహోర్ డిక్లరేషన్లు కూడ ద్వైపాక్షికంగానే జరిగాయని ఇండియా ప్రకటించిన విషయాన్ని ఫాక్స్ మీడియా ప్రతినిధి పాక్ ప్రధాని ఇమ్రాన్ దృష్టికి తీసుకొచ్చారు.

కాశ్మీర్ విషయమై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రధాని స్వాగతించారు.మరో వైపు తాము కూడ అణ్వాయుధాలను వదిలేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే ఇండియా కూడ అణ్వాయుధాలను వదిలేస్తే  తాము కూడ అణ్వాయుధాలను వదిలేస్తామని  ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కాశ్మీర్‌పై ట్రంప్ వివాదాస్పదం: ఖండించిన భారత్
 

click me!