లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

By Siva Kodati  |  First Published Mar 1, 2019, 12:15 PM IST

పాకిస్తాన్ సైన్యం అదుపులో ఉణ్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను అప్పగించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. రావల్పిండిలో ఉన్న ఆయనను శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో లాహోర్‌కు తరలించారు


పాకిస్తాన్ సైన్యం అదుపులో ఉణ్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను అప్పగించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. రావల్పిండిలో ఉన్న ఆయనను శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో లాహోర్‌కు తరలించారు.

అక్కడ అంతర్జాతీయ రెడ్ క్రాస్ సోసైటీ ప్రతినిధులకు ఆయన్ను అధికారులు అప్పగిస్తారు. అనంతరం రోడ్డు మార్గం గుండా అభినందన్ వాఘా సరిహద్దుకు చేరకుంటారు. మధ్యాహ్నం రెండు గంటల కల్లా ఆయన భారత భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

Latest Videos

ఈ నేపథ్యంలో వాఘా వద్ద ఉద్విగ్న పరిస్ధితులు నెలకొన్నాయి. వర్థమాన్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పెద్ద సంఖ్యలో ప్రజలు వాఘా వద్ద ఎదురుచూస్తున్నారు. 

click me!