మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

By Siva KodatiFirst Published Mar 1, 2019, 10:11 AM IST
Highlights

ప్రస్తుతం భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలతో పాటు... ఉగ్రవాదులకు సాయాన్ని నిలిపివేయాలని, ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయాలని అంతర్జాతీయ సమాజాం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆ దేశం నష్టనివారణ చర్యలు చేపడుతోంది.

దీనిలో భాగంగా పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్‌ తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్ ప్రకటించింది. ప్రస్తుతం మసూద్ ఆరోగ్యం బాలేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి తెలిపారు.

అతను ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో లేడని ఆయన వెల్లడించారు. మసూద్‌కు వ్యతిరేకంగా భారత్ సాక్ష్యాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఖురేషి స్పష్టం చేశారు. అయితే మా దేశ న్యాయస్థానాలు ఆమోదించేలా సాక్ష్యాధారాలు ఉండాలన్నారు. 

click me!