హ్యాకింగ్‌ భయంలో పాకిస్తాన్... కీలక వెబ్‌సైట్లకు భద్రత

By Siva KodatiFirst Published Mar 1, 2019, 12:03 PM IST
Highlights

పుల్వామా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ప్రస్తుతం భారత్-పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. యుద్ధం కంటే ముందు దాయాది దేశానికి మరో భయం వెంటాడుతోంది. అదే సైబర్ దాడి.

పుల్వామా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ప్రస్తుతం భారత్-పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. యుద్ధం కంటే ముందు దాయాది దేశానికి మరో భయం వెంటాడుతోంది. అదే సైబర్ దాడి...

తమ కన్నా టెక్నాలజీ పరంగా ఎన్నో రెట్లు బలమైన భారత్... తమపై సైబర్ దాడులకు దిగుతుందేమోనని ఆ దేశం భయపడుతోంది. ఈ క్రమంలో కీలక శాఖల వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ప్రధానంగా ఆర్మీ వెబ్‌సైట్‌ను భారతీయులు యాక్సెస్ చేయకుండా ఉండేందుకు గాను... ‘‘ మీ దేశంలో ఈ వెబ్‌సైట్ యాక్సెస్‌‌పై నిషేధం ఉంది’’ అన్న సందేశం కనిపిస్తోంది. అదే విధంగా నేవీ, ఎయిర్‌ఫోర్స్, రక్షణ శాఖ వెబ్‌సైట్లను సొంత సర్వర్ నుంచి తప్పించి ‘‘క్లౌడ్‌ఫ్లేర్’’లొ హోస్ట్ చేశారు.

వీటితో పాటు ఇతర ప్రభుత్వం వెబ్‌సైట్లను కూడా క్లౌడ్‌లో పెట్టింది. ఈ చర్య వల్ల  వాటికి ఎలాంటి అదనపు నిఘా అవసరం లేకుండానే, ఆయా వెబ్‌సైట్లను హ్యాకింగ్ చేయకుండా ఆపవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది.

క్లౌడ్‌ఫ్లేర్‌లో భద్రతా ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయని, వాస్తవ హోస్టింగ్ పాక్ సర్వర్లలోనే ఉంటాయని చెబుతున్నారు. డీడాస్, ఎస్‌క్యూఎల్ దాడులు జరిపినా... అసలైన సర్వర్‌లో ఉండే డేటాబేస్‌కు ఎలాంటి నష్టం వాటిల్లదంటున్నారు. అయితే క్లౌడ్‌ఫ్లేర్‌లో ఉన్నా ఆయా వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం పెద్ద సమస్య కాదని కొందరు సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. 

click me!