‘నేను ఎవ్వరినీ విశ్వసించను..వారేం చేస్తారో చూద్దాం’... తాలిబన్ల పై బిడెన్ వ్యాఖ్యలు...

By AN TeluguFirst Published Aug 23, 2021, 10:20 AM IST
Highlights

జో బిడెన్ వైట్ హౌస్ నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సంద్భంగా మాట్లాడుతూ.. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఏమైనా చేయాలని ప్రయత్నిస్తుంటే, వారికి ఆర్థిక సహాయం, వాణిజ్యం లాంటి అనేక విషయాల్లో... అదనపు సహాయం అవసరమని బిడెన్ అన్నారు.

వాషింగ్టన్ : తాలిబాన్ చట్టబద్ధతను కోరుతోంది. వాగ్దానాలు చేసింది. కానీ "వారు మరి మాటను నిలుపుకుంటారా, లేదా" వాషింగ్టన్ గమనిస్తుంది.. అని అమెరికా జో బిడెన్ అన్నారు. ఆఫ్గనిస్తాన్ ను వశం చేసుకున్న తాలిబాన్లను నమ్ముతున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇస్తూ "నేను ఎవరినీ నమ్మను" అని చెప్పుకొచ్చారు.

జో బిడెన్ వైట్ హౌస్ నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సంద్భంగా మాట్లాడుతూ.. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఏమైనా చేయాలని ప్రయత్నిస్తుంటే, వారికి ఆర్థిక సహాయం, వాణిజ్యం లాంటి అనేక విషయాల్లో... అదనపు సహాయం అవసరమని బిడెన్ అన్నారు.

అంతేకాదు "నేను ఎవరినీ విశ్వసించను. గత వందేళ్లలో ఏ గ్రూపూ దీన్ని సాధించని...ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని ఏకతాటిమీదికి తీసుకువచ్చి, వారంతా ఐకమత్యంగా ఉండేలా చేయడానికి వారి శ్రేయస్సు కోసం కృషి చేయబోతున్నారా?.. అనే విషయం మీద  తాలిబాన్లు ఫండమెంటల్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంది. వారి శ్రేయస్సుకు, వారికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? అలాగయితే అదే అయితే ఆర్థిక సహాయం, వాణిజ్యంలాంటి అనే విషయాల పరంగా అదనపు సహాయం వారికి కావాల్సి ఉంటుందని.. జో బిడెన్ తాలిబన్లను నమ్ముతున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. 

"తాలిబాన్ వాగ్దానాలు చేసింది. కానీ, వారు మరి మాటను నిలుపుకుంటారా, లేదా? వాషింగ్టన్ గమనిస్తుంది.. ఇతర దేశాలు వీరిని గుర్తిస్తాయో లేదు తెలుసుకోవడానికి వారు చట్టబద్ధతను కోరుతున్నారు. వారు మన దౌత్యపరంగా వెళ్లాలని వారు కోరుకోవడం లేదు. ఇతర దేశాలతో పాటు అమెరికాకు చెప్పారు. ఇప్పుడు తాలిబన్ పూర్తిగా ఉనికిలో ఉంది. ఇప్పుడు ఈ చర్చ అంతా, ఇప్పటివరకు తాలిబన్లు US దళాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోవడం మీదే, "అన్నారాయన.

ఆఫ్ఘనిస్తాన్: వారం రోజుల్లో 20 మంది మృతి... నాటో అధికారిక ప్రకటన

అఫ్గనిస్థాన్ లోని వేరే దేశపౌరులను కాబూల్ లోని ఓ విమానాశ్రయం నుంచి స్వదేశాలకు పంపిస్తున్నారు. అయితే ఈ విమానాశ్రయం అమెరికా బలగాల ఆధీనంలో ఉండడంతో ఈ ప్రశ్న తలెత్తింది. ఆఫ్గన్ తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం, అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనం తరువాత ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతా పరిస్థితులు భయాందోళనలు కలిగించడంతో ఈ తరలింపులు జరుగుతున్నాయి.

యుఎస్ మిలిటరీ ఆగస్టు 14 నుండి ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 25,100 మందిని తరలించింది. అదే జూలై చివరి నుంచి సుమారు 30,000 మందిని తరలించింది. ఆగస్టు 31 గడువు దాటాక కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో తరలింపు కార్యక్రమం పొడిగింపు గురించి.. తమ సైనిక అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు బిడెన్ చెప్పారు.

కాబూల్ విమానాశ్రయం చుట్టూ అమెరికా సేఫ్ జోన్‌ను పొడిగించినట్లు బిడెన్ తెలియజేశారు. "మేము విమానాశ్రయం, సేఫ్ జోన్ చుట్టూ యాక్సెస్‌ని విస్తరించడంతో సహా అనేక మార్పులు చేశాం" అని ఆయన చెప్పారు. శుక్రవారం బిడెన్ మాట్లాడుతూ... ఆఫ్ఘనిస్తాన్ నుండి తరలింపు అనేది చరిత్రలో ఎన్నడూ లేనంత కష్టతరమైన, అతిపెద్ద ఎయిర్‌లిఫ్ట్ అని పేర్కొన్నారు.

యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుండి అమెరికన్లు, మిత్రదేశాల పౌరులను బయటకు తీసుకువస్తామని బిడెన్ హామీ ఇచ్చారు. "కాబూల్ తరలింపు చరిత్రలో అతిపెద్ద, అత్యంత కష్టమైన ఎయిర్‌లిఫ్ట్‌లలో ఒకటి" అని బిడెన్ చెప్పారు.

click me!