పాకిస్థాన్ కు హ్యాండిచ్చిన చైనా: ప్రపంచం అంతా భారత్ వెంటే....

By Nagaraju penumalaFirst Published Feb 27, 2019, 9:10 PM IST
Highlights

ఇది పాకిస్థాన్‌కు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని హెచ్చరించారు. హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ థింక్ ట్యాంక్‌లో దక్షిణ, మధ్య ఆసియా విభాగానికి డైరెక్టరుగా వ్యవహరిస్తున్న హక్కానీ పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయని అన్ని దేశాలు భారత్ వెంటే ఉన్నాయన్నారు. 

వాషింగ్టన్‌: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త ఘటనలపై అమెరికాలో పాక్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దాడుల నేపథ్యంలో ఏ ఒక్క దేశం పాకిస్థాన్‌కు మద్దతుగా నిలవలేడం లేదని ఆఖరికి చైనా కూడా పాక్ వెంట నిలవలేదని స్పష్టం చేశారు. 

ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయన్నారు. ఈ వైఖరి ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రస్థావరాలకు నెలవుగా మారిన దేశాలను ఇక ఏ మాత్రం సహించబోరని తెలిపారు. 

ఇది పాకిస్థాన్‌కు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని హెచ్చరించారు. హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ థింక్ ట్యాంక్‌లో దక్షిణ, మధ్య ఆసియా విభాగానికి డైరెక్టరుగా వ్యవహరిస్తున్న హక్కానీ పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయని అన్ని దేశాలు భారత్ వెంటే ఉన్నాయన్నారు. 

మరోవైపు పాకిస్థాన్ స్కాలర్ మొయీద్‌ యూసఫ్‌ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా పాక్‌కు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు లేవని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని దేశాలు భారత్‌కే మద్దతిస్తున్నాయని తెలిపారు. 

అందుకే పాక్‌ భూభాగంలోకి భారత్‌ చొచ్చుకువెళ్లి దాడి చేసినా ప్రపంచ దేశాలు అంతగా స్పందించలేదన్నారు. అలాగే రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారితే తీవ్ర పరిణామాలుంటాయని యూసఫ్ హెచ్చరించారు. 

click me!