తండ్రి బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనా... కొడుకు మాత్రం సాధారణ పెయింటర్

By Arun Kumar PFirst Published Nov 8, 2020, 8:32 AM IST
Highlights

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన  బైడెన్ ఇద్దరు కుమారుల్లో ఒకరు 2015లో క్యాన్సర్ తో మృతిచెందగా మరో కుమారుడు లాస్‌ ఏంజిల్స్‌లో సాధారణ పెయింటర్‌గా జీవితం గడుపుతున్నారు. 

వాషింగ్టన్:  ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె ట్రంప్ కు గట్టిపోటీనిచ్చి అమెరికా అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు జో బైడెన్. అతడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం కంటే ట్రంప్ ను ఓడించడంపైనే ప్రజల్లో ఎక్కువ చర్చ సాగుతోంది. దీంతో అసలు ఎవరీ బైడెన్, అమెరికన్లు ట్రంప్ ని కాదని అతడిని ఎందుకంతలా నమ్మారు, అసలు అతడి జీవిత, రాజకీయ ప్రస్థానమేమిటి అన్న విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

ఈ క్రమంలోనే అతడి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయమొకటి బయటపడింది. బైడెన్ దేశ అధ్యక్షుడిగా పోటీపడే స్థాయిలో వున్నాడు కాబట్టి అతడి కుమారులు అత్యున్నత స్థాయిలో వున్నారనుకుంటే మీరు పొరపడినట్లే. బైడెన్ ఇద్దరు కుమారుల్లో ఒకరు 2015లో క్యాన్సర్ తో మృతిచెందగా మరో కుమారుడు లాస్‌ ఏంజిల్స్‌లో సాధారణ పెయింటర్‌గా జీవితం గడుపుతున్నారు. 

read more  ఐదు సార్లు పెళ్లికి నిరాకరణ: జ్యో బైడెన్ భార్య, ఎవరీ జిల్ బైడెన్?

తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టే దశలో బైడెన్ కుమారుడు బ్యూ  2015లో బ్రెయిన్‌ క్యాన్సర్‌తో మరణించాడు.ఇక ఆయన మరో కొడుకు హంటర్ డ్రగ్స్ కు బానిసయి డోప్ టెస్టులో పట్టుబడి 2014లో అమెరికా నౌకాదళం రిజర్వ్ నుండి తొలగించబడ్డాడు. ఆ తర్వాత అతడు ఈ డ్రగ్స్ బారినుండి బయటపడి తండ్రి రాజకీయాలకు దూరంగా లాస్‌ ఏంజిల్స్‌లో పెయింటర్‌గా జీవితం గడుపుతున్నారు.  

click me!