Bizarre Love Story: హంగేరీలోని బుడాపెస్ట్‌కు చెందిన సాండ్రా అనే 28 ఏళ్ల యువతి..ప్రేమలో పడింది. కానీ తోటి మనిషిలో కాదు. ఆమె ప్రేమలో పడింది ఓ బొమ్మ విమానంతో.. ఆ విమానాన్నే ఆత్మ సహచరుడు( సోల్ మెట్) గా భావిస్తుంది. సాండ్రా గతేడాది£600 (₹60,915)లతో ఓ బొమ్మ విమానాన్ని కొనుగోలు చేసింది. ఆ బొమ్మకు 'లఫ్ఫాంక్స్' అని పేరు పెట్టింది.
Bizarre Love Story: ప్రేమ తీరే వేరు..! ఈ సృష్టిలో ప్రేమ ప్రతి ఒక్కరూ.. ఈ మధుర అనుభూతిని ఒక్కసారైనా పొందాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే ఈ ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరిపై పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. తెలియకుండానే పుట్టేస్తుంది. ఒక్కసారి ఒకరిమీద ప్రేమ కలిగిందంటే జీవితాంతం ఉంటుంది. ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా... తమ ప్రేమను గెలిపించుకోవాలనే ప్రయత్నిస్తారు. అలా కొంతమంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకుని, పెళ్లితో జీవిత ప్రయాణానికి సిద్ధపడుతారు.
కానీ, ఇప్పుడు చెప్పుకునే ప్రేమ కథ చాలా విచిత్రమైంది.. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయి.. ఓ అబ్బాయితో ప్రేమలో పడకుండా.. తనకు ఇష్టమైన ఓ బొమ్మ విమానంతో ప్రేమలో పడింది. దానినే తన సోల్ మేట్ గా భావిస్తుంది. ఆ బొమ్మనే ప్రాణంగా జీవిస్తుంది. ఏంటీ .. ఓ అమ్మాయి ఏంటీ..? ఓ బొమ్మ విమానంతో ప్రేమలో పడటమేమిటనీ? అనుకుంటున్నారా? అవునండీ బాబు.. ఇదే నిజం..
వివరాల్లోకెళ్తే.. హంగేరీలోని బుడాపెస్ట్‌కు చెందిన సాండ్రా అనే 28 ఏళ్ల యువతి..ప్రేమలో పడింది. కానీ తోటి మనిషిలో కాదు. ఆమె ప్రేమలో పడింది ఓ బొమ్మ విమానంతో.. ఆ విమానాన్నే ఆత్మ సహచరుడు( సోల్ మెట్) గా భావిస్తుంది. సాండ్రా గతేడాది£600 (₹60,915)లతో ఓ బొమ్మ విమానాన్ని కొనుగోలు చేసింది. ఆ బొమ్మకు 'లఫ్ఫాంక్స్' అని పేరు పెట్టింది.
"నాకు ఎందుకు తెలియదు.. కానీ, నేను అతనిని ప్రేమిస్తున్నాను" అని సాండ్రా బొమ్మ విమానం గురించి చెప్పింది. దానిని తన “సోల్‌మేట్” అని పిలుస్తూ,
undefined
ఉదయం నిద్రలేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు అనునిత్యం ఆమె తన బొమ్మ విమానంతో గడుపుతోంది. రాత్రి కూడా ఆ బొమ్మతోనే.. రాత్రంతా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం. ఇలా ఓ ప్రియుడితో ఓ ప్రియురాలు ఎలా ఉంటుందో ఆ యువతి కూడా అలానే ఉంటుంది. తాను మొదటిసారి ప్రేమలో పడ్డానని ఆమె చెప్పుకుంటుంది.
ఆమె యువతికి చిన్నతనం నుంచే విమానం అంటే.. చాలా ఇష్టం.. అలా విమానాలపై మోహం పెంచుకుంది. ఆ తరువాత.. ఆ ఇష్టంతోనే 2021లో విమానయాన రంగంలో ఉద్యోగం సాధించింది. ఇలా.. తన ఇష్టం ఇంకాస్తా.. పీక్స్ వెళ్లిపోయింది. గత సంవత్సరం చివరిలో తన బాయ్ ఫ్రెండ్స్ తనకు బ్రేకప్ చెప్పడంతో .. తన ప్రేమను ఇలా బొమ్మ విమానం పై చూపిస్తుందని తన సహాచరులు చెప్పున్నారు.