
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) యుద్ధాని(War)కి ఆపడానికి పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. పలు విధాలుగా హెచ్చరికలు చేస్తున్నాయి. కానీ, రష్యా వెనుకడుగు వేయడం లేదు. ఒక్కో నగరంగా ఉక్రెయిన్ దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే రష్యా, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) పై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఫ్రాన్స్‌లో కొందరు యువతులు ఏకంగా వ్లాదిమిర్ పుతిన్‌ను వ్యతిరేకిస్తూ టాప్‌లెస్ నిరసనలు (Topless Protest) చేశారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడిదయోను ఓ న్యూస్ ఏజెన్సీ ఈ నెల 7వ తేదీన ట్విట్టర్‌లో షేర్ చేసింది.
ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ ముందు కొందరు యువతులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. అందులో వారు అర్ధనగ్నంగా కనిపించారు. టాప్‌లెస్‌గా ఉండి.. తమ దేహాలపై యుద్ధ వ్యతిరేక నినాదాలు రాసుకున్నారు. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ఆ దేశ జెండాను ప్రతిబింబించే కలర్‌లు పూసుకున్నారు. పుతిన్.. యుద్ధాన్ని ఆపాలి.. మహిళావాదులు యుద్ధానికి వ్యతిరేకం వంటి నినాదాలు రాసుకున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరకంగా ఈ మహిళావాదుల సంఘం ఫెమెన్ నిరసనలు కొత్తవేమీ కావు. గతంలోనూ ఆయనకు ఈ అర్ధనగ్న ఆందోళనలు ఎదురర్కోవాల్సి వచ్చింది. 2013లో ఆయన ఇలాంటి వ్యతిరేకతనే ఎదుర్కొన్నారు. అంతేకాదు, ఆ ప్రదర్శనలపై కామెంట్ కూడా చేసినట్టు అదే న్యూస్ ఏజెన్సీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది. వారు ఏమని నినదిస్తున్నారో తనకు అర్థం కాలేదని, కానీ, వారి ప్రదర్శన తనకు నచ్చిందని పుతిన్ పేర్కొన్నట్టు ఆ ట్వీట్ తెలిపింది.