సౌదీ రాజకుటుంబంలో పలువురికి కరోనా, 150 మంది క్వారంటైన్ కు

By narsimha lodeFirst Published Apr 9, 2020, 4:47 PM IST
Highlights

సౌదీ రాజ కుటుంబంలో పలువురికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. సుమారు 150 మందిని క్వారంటైన్ లో ఉంచారు.
 

దుబాయ్: సౌదీ రాజ కుటుంబంలో పలువురికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. సుమారు 150 మందిని క్వారంటైన్ లో ఉంచారు.

సౌదీ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్. రియాద్ గవర్నర్ గా ఉన్నారు. అతని వయస్సు 70 ఏళ్లు. కరోనా లక్షణాలతో ఆయనను ఇంటెన్సివ్ కేర్ ఉంచి చికిత్స చేస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. 

ప్రిన్స్ తో సన్నిహితంగా ఉన్నవారికి కూడ ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో 500 పడకలను సిద్దం చేశారు. 150 మంది క్వారంటైన్ ను తరలించారు అధికారులు.

అయితే అత్యవసర కేసులను మాత్రం చికిత్స చేసి పంపుతున్నట్టుగా వైద్యులు ప్రకటించారు. సుమారు 150 మంది రాయల్ ఫ్యామిలీ సభ్యులకు ఈ వైరస్ సోకిందని సమాచారం. అనుమానిత లక్షణాలను ఉన్నవారిని క్వారంటైన్ చేశారు. 

సౌదీ రాజులు క్రమం తప్పకుండా యూరప్ పర్యటనకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వారికి ఈ వైరసోకిందనే అనుమానాలు కూడ లేకపోలేదు.సౌదీ అరేబియాలో 2400 కేసులు నమోదు కాగా 41 మంది మృతి చెందారు.రాజు సల్మాన్ ప్రైవేట్ అప్పులు చెల్లించలేని ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. 
 

click me!