అమెరికాలో కుండపోత వర్షాలు: వైట్‌హౌస్‌లోకి వరద నీరు

Siva Kodati |  
Published : Jul 09, 2019, 01:06 PM IST
అమెరికాలో కుండపోత వర్షాలు: వైట్‌హౌస్‌లోకి వరద నీరు

సారాంశం

అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు జలమయం కావడంతో కొన్ని ప్రాంతాల్లో కార్లు నీటిలో మునిగిపోయాయి. 

అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు జలమయం కావడంతో కొన్ని ప్రాంతాల్లో కార్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనదారులు వాటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

మొత్తం 15 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. కాగా.. వర్షాలు, వరదల ప్రభావం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ పైనా పడింది. శ్వేతసౌధం బేస్‌మెంట్‌లోని కార్యాలయాల్లోకి వరదనీరు చేరింది.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం రోజున వాషింగ్టన్‌లో కురిసిన భారీ వర్షం ప్రమాదకర పరిస్ధితులను ఏర్పరిచిందని జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Iran Israel War లోకి ఇండియా ఇండైరెక్ట్ ఎంట్రీ..? ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్..?
Israel Iran War : 50 ఫైటర్ జెట్స్.. 100 బాంబులు.. ఇరాన్ సుప్రీం లీడర్ బంకర్ విధ్వంసం వీడియో వైరల్