అమెరికాలో ప్రధాని మోడీని ప్రశ్నించిన జర్నలిస్ట్ పై వేధింపులు.. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమన్న వైట్ హౌస్

Published : Jun 27, 2023, 12:33 PM IST
అమెరికాలో ప్రధాని మోడీని ప్రశ్నించిన జర్నలిస్ట్ పై వేధింపులు.. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమన్న వైట్ హౌస్

సారాంశం

అమెరికాలో మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధింపులకు గురి చేయడం సరైంది కాదని ఆ దేశ అధ్యక్ష భవనం వైట్ హౌస్ పేర్కొంది. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్దమని తెలిపింది. 

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. ఆ జర్నలిస్టుపై ఆన్ లైన్ లో వేధింపులు జరుగుతున్నాయి. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్దమని పేర్కొంది.

పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు 

ప్రధానిని ప్రశ్నించిన జర్నలిస్టు సబ్రినా సిద్ధిఖీపై ఆన్ లైన్ వేధింపులు ఎక్కువయ్యాయని మరో జర్నలిస్ట్ కెల్లీ ఓ డోనెల్ సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. వేధింపులకు గురి చేసిన వారిలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై వైట్ హౌస్ స్పందించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం ఈ విధంగా స్పందించింది.

కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి ప్రధాని మోడీ జూన్ 23వ తేదీన (శుక్రవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా వాల్ స్ట్రీట్ జర్నల్ కు చెందిన సబ్రినా సిద్ధిఖీ.. భారతదేశంలోని ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కులను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. దీనికి ప్రధాని సమాధానమిస్తూ.. ‘‘ప్రజాస్వామ్యం మా సిరల్లో నడుస్తోంది. కులం, మతం, మతం ప్రాతిపదికన వివక్షకు తావులేదు.’’ అని అన్నారు.

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాంలో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం.. పోలీసుకు గాయాలు

‘‘మనది ప్రజాస్వామ్యం. భారత్, అమెరికా రెండింటిలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం మన స్ఫూర్తిలో ఉంది. దాన్ని మనం జీవిస్తున్నాం. అది మన రాజ్యాంగంలో రాసి ఉంది. కులం, మతం, ప్రాతిపదికన వివక్షకు తావు లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఈజిప్టు పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి భారత్ కు తిరిగి వచ్చారు.  

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?