
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని బార్‌లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాలిఫోర్నియాలోని ట్రాబుకో కాన్యన్‌లోని 'కుక్స్ కార్నర్' అనే బైకర్ బార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒక షూటర్ కాల్పులు జరిపి ఐదుగురిని చంపాడు. ఆరుగురికి కూడా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆరెంజ్ కౌంటీ పోలీసు అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. కాల్పులు జరిపిన వ్యక్తి మాజీ భద్రతా అధికారి అని, ఆ షూటర్ బార్‌లోనే కాల్పులు జరిపారు. తనను దూరం పెడుతున్న భార్యను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఆరెంజ్ కౌంటీ పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనలో అధికారులెవరూ గాయపడలేదు. ఘటనాస్థలికి దూరంగా ఉండాలని పోలీసు అధికారులు ప్రజలను కోరారు. కాల్పులు జరిపిన వ్యక్తి చనిపోయాడని, అతను రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ అని, అతను తనకు తెలిసిన వారిని లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తి చెప్పాడు.
గత జనవరిలో కూడా కాలిఫోర్నియాలో కాల్పుల ఘటన జరిగాయి. అందులో 10 మంది మరణించారు. వాస్తవానికి చైనా లూనార్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. లాస్ ఏంజెల్స్‌లో ఒక వ్యక్తి మానిటరీ పార్క్ ప్రాంతంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఆసియా సంతతికి చెందిన వారు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఆసియా మూలాలకు చెందిన వారు చనిపోయారు. ఇవే కాకుండా అమెరికాలో ఎన్నో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడంతోపాటు అక్కడి నుంచి ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ గన్ కల్చర్ రెచ్చిపోతుంది.