మీరు డబ్బులు పెట్టి వెళ్లారు .. మేం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం: పాకిస్తాన్ యువకుడి ఫన్నీ కామెంట్స్ (Video)

Published : Aug 24, 2023, 01:08 PM ISTUpdated : Aug 24, 2023, 01:14 PM IST
మీరు డబ్బులు పెట్టి వెళ్లారు .. మేం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం: పాకిస్తాన్ యువకుడి ఫన్నీ కామెంట్స్ (Video)

సారాంశం

వాళ్లు డబ్బులు పెట్టి చంద్రుడి మీదికి వెళ్లుతున్నారు. కానీ, మనం  ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం. చంద్రుడిపై నీరు ఉన్నదా? గ్యాస్ ఉన్నదా? కరెంట్ ఉన్నదా? లేవు కదా.. పాకిస్తాన్‌లోనూ లేవు.. అంటూ ఓ యూట్యూబర్‌కు యువకుడు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 మిషయం విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ప్రశంసలు వస్తున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ నుంచి కూడా పొగడ్తలు వచ్చాయి. పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను పాకిస్తాన్ మీడియా కూడా లైవ్‌లో చూపెట్టాలని కొన్ని నిమిషాల ముందు సూచించారు. భారత్ పై ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని ఆధారం చేసుకుని పాకిస్తాన్ ప్రజలు చంద్రయాన్ 3 ప్రయోగాన్ని వీక్షించాలని అనుకుంటున్నదా? ఆ ప్రయోగం గురించి ఆలోచిస్తున్నదా? అంటూ ఓ పాకిస్తాన్ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశాడు. తాజాగా పాకిస్తాన్ యువకుడు చంద్రయాన్ 3 పై చేసిన ఫన్నీ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేపట్టిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ చేసిన తొట్ట తొలి దేశంగా అవతరించింది. ఈ సందర్భంగా భారతీయులంతా ఉత్సవాలు జరుపుకున్నారు. పాకిస్తాన్ యువకుడు ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. భారత్ పై ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ యువత కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని, దురదృష్టవశాత్తు పాకిస్తాన్ నాయకత్వం దేశాన్ని ప్రగతి మార్గంలో తీసుకెళ్లే ఆలోచనలు చేయడం లేదని వాపోయారు. ఇదే సందర్భంలో ఆయన చంద్రయాన్ 3 గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Also Read: Hello Moon: దక్షిణ ధ్రువంపై తొలి దేశంగా ఇండియా.. ఈ 14 రోజులపైనే అందరి చూపు

‘అరే.. వాళ్లు డబ్బులు పెట్టి మరీ చంద్రుడి మీదికి వెళ్లుతున్నారు. కానీ, మనం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం కదా’ అని యూట్యూబర్‌కు ఆ వ్యక్తి తెలిపాడు. అదేంటి.. మనం చంద్రుడిపై ఎలా ఉన్నాం. భూమి పైనే ఉన్నాం కదా? అని యూట్యూబర్ పేర్కొన్నాడు. దీనికి సదరు యువకుడు చంద్రుడికి, పాకిస్తాన్‌కు మధ్య పోలికలు తీశాడు. చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయా? అని అడగ్గా లేవని యూట్యూబర్ సమాధానం ఇచ్చాడు. పాకిస్తాన్‌లోనూ నీళ్లు లేవని యువకుడు అన్నాడు. చంద్రుడి మీద గ్యాస్ ఉన్నదా? లేదని చెప్పగా అంతే! పాకిస్తాన్‌లో కూడా లేదని చెప్పాడు. చంద్రుడి మీద కరెంట్ ఉన్నదా? అని అడగ్గా యూట్యూబర్ లేదని జవాబిచ్చాడు. పాకిస్తాన్‌లో కూడా లేదు.. ఇప్పుడు కరెంట్ లేదు కదా..అని ఆ యువకుడు అన్నాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !