12 బిలియన్ వ్యాక్సిన్ల అందజేత.. అయినా గమ్యాన్ని చేరలేదు..

By Rajesh KarampooriFirst Published Oct 22, 2022, 7:30 AM IST
Highlights

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ 12 బిలియన్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లను అందజేశామని తెలిపారు. అయినా..పేద దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 12 బిలియన్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లను అందజేశామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. ఇది మానవ చరిత్రలో  అతి పెద్ద, వేగవంతమైన టీకా ప్రచారాన్ని వివరించారు. అయినా.. కోవిడ్‌కు వ్యతిరేకంగా బలమైన రక్షణ విషయంలో ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని  అన్నారు. 

అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యాక్సిన్ తయారీదారుల నెట్‌వర్క్ (DCVMN) వార్షిక సర్వసభ్య సమావేశంలో డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ గురువారం వర్చువల్‌గా ప్రసంగిస్తూ..COVID-19 వ్యాక్సిన్‌ల యాక్సెస్‌లో అసమానతల సమస్యను ఆయన ఎత్తిచూపారు. ప్రపంచవ్యాప్తంగా 12 బిలియన్ల కంటే ఎక్కువ కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌ల పంపిణీ చేశామని తెలిపారు. ఇది అతిపెద్ద, వేగవంతమైన ప్రచారమని తెలిపారు.డీసీవీఎంఎన్ ఉత్పత్తి చేయబడిన 60 శాతం డోస్‌లను ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ ఘనత ఉన్నప్పటికీ, COVID-19 వ్యాక్సిన్‌ల యాక్సెస్‌లో అసమానతలు అలాగే ఉన్నాయని, పేద దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తెలిపారు.

ఈ అసమానతలను పరిష్కరించడానికి..తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో జ్ఞానాన్ని సులభతరం చేయడానికి WHO, తమ భాగస్వాములు దక్షిణాఫ్రికాలో mRNA టెక్ ట్రాన్స్‌ఫర్ హబ్‌ను స్థాపించినట్టు  గెబ్రేయేసస్ తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌ను పూణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సహ-హోస్ట్ చేస్తోంది.  

DCVMN వార్షిక సమావేశాన్ని పూణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నిర్వహిస్తోంది.పూణేలో 23వ DCVMN వార్షిక సర్వసభ్య సమావేశానికి సహ-హోస్ట్ చేయడం తమ కంపెనీకి గర్వకారణమని SII సీఈఓ అదార్ పూనావాలా అన్నారు. SII ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు. ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా అవగాహన కలిగి ఉందని, భవిష్యత్తు పట్ల మరింత అప్రమత్తంగా ఉందని SII సీఈవో అదార్ పూనావాలా అన్నారు. ప్రపంచ మహమ్మారిని అధిగమించడానికి మౌలిక సదుపాయాల సమానత్వం మరియు వ్యాక్సిన్‌ల పంపిణీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రారంభోపన్యాసం చేశారు.

DCVMN అనేది 170 దేశాలకు అధిక నాణ్యత గల వ్యాక్సిన్‌ల ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి, తయారీ మరియు సరఫరాలో నిమగ్నమై ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల తయారీదారుల అంతర్జాతీయ కూటమి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధిక నాణ్యత గల వ్యాక్సిన్‌ల ఉత్పత్తిని పెంచడం ద్వారా   అభివృద్ధి చెందుతున్న అంటు వ్యాధుల నుండి ప్రజలను రక్షించడం ఈ సంస్థ లక్ష్యం.

click me!