భూమిపైకి దూసుకువస్తున్న గ్రహశకలం... ఇది మనపై పడుతుందా?

Published : May 23, 2025, 02:05 PM IST
asteroid

సారాంశం

ఈ వారాంతంలో భూమిని ఒక భారీ గ్రహశకలం సమీపించి వెళ్తుంది. ఐఫిల్ టవర్‌కు సమానంగా ఉన్న ఈ గ్రహశకలం మే 24న అంటే రేపు శనివారం సాయంత్రం 4:07 గంటలకు భూమిని దాటుతుంది. ఈ గ్రహశకలాన్ని అమెరికా పరిశోధన సంస్థ నాసా “క్లోజ్ ఎన్‌కౌంటర్”గా పేర్కొంది. 

387746 (2003 MH4) అనే ఈ ఆస్టరాయిడ్ యొక్క వెడల్పు సుమారు 335 మీటర్లు, అంటే 100 అంతస్తుల భవనానికి సమానం. ఇది 30,060 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భూమిని ఒక గంటలో ఒకసారి చుట్టగలదు. ఈ గ్రహశకలాన్ని నాసా యొక్క Centre for Near-Earth Object Studies (CNEOS) నిశితంగా గమనిస్తోంది. దాని పరిమాణం, వేగం, భూమికి చేరువగా రావడం అనేవి ఆస్టరాయిడ్స్ తో భూమికి పొంచివున్న ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయి.

రేపు భూమికి దగ్గరగా వచ్చే ఈ ఆస్టరాయిడ్ ప్రమాదకరం కాకపోయినప్పటికీ పరిశోధకులు దీని కక్ష్య మార్పులను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇది 2003 MH4 అపోలో గ్రూప్ కు చెందినది. ఈ గ్రూప్‌లోని గ్రహశకలాలు భూమి యొక్క కక్ష్య మార్గాన్ని దాటుతుంటాయి. ఈసారి MH4 భూమికి 6.67 మిలియన్ కిలోమీటర్ల దూరంలో (చంద్రుడి దూరానికి 17 రెట్లు) దాటనుంది. భద్రతా పరంగా ఇది 7.5 మిలియన్ కిలోమీటర్ల లోపల ఉన్న మరియు 140 మీటర్ల కంటే పెద్ద గ్రహశకలాల పరిధిలోకి వస్తుంది.

భవిష్యత్తు పట్ల ఆందోళన ఏమిటంటే వివిధ కారణాల వల్ల గ్రహశకలాల దారులు మారవచ్చు. దీని వల్ల భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. "ఇలాంటి ఆస్టరాయిడ్స్ లో ఒకటి భూమిని ఢీకొంటే, దాని శక్తి వేల అణుబాంబుల ధ్వంస సామర్థ్యానికి సమానం" అని నాసా వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి ఘటనల వల్ల విధ్వంసం, అగ్ని ప్రమాదాలు, సునామీలు, భూకంపాల శక్తివంతమైన తరంగాలు వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

ఇటీవలే భూమికి దగ్గరగా మరో గ్రహశకలం

మరో ఆసక్తికరమైన ఘటన గత బుధవారం (మే 21న) జరిగింది. 2025 KF అనే గ్రహశకలం భూమికి కేవలం 1.11 లక్షల కిలోమీటర్ల దూరంలో (చంద్రునికి మూడవంతు దూరం) దాటింది. దీని వెడల్పు 23 మీటర్లు. ఈ గ్రహశకలం పెద్దది కాకపోయినా ఇలాంటి చిన్న చిన్న రాళ్లు గ్రహ ఆకర్షణ వల్ల ఆకృతి మారుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి భూమిని ఢీకొంటే పెద్ద విధ్వంసం కాకపోయినా చిన్న కంపనాలకు కారణం అవుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే