afghanistan : నమ్మకద్రోహం... తాలిబన్లతో చేతులు కలిపి, ఘనీకి వెన్నుపోటు..

By AN TeluguFirst Published Aug 24, 2021, 11:30 AM IST
Highlights

కాబూల్  అంత తేలిగ్గా తాలిబన్ల వశం కాదన్న తమ గూడచారి వర్గాల అంచనాలను నమ్మిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వేసవి విహారానికి సిద్ధమయ్యారు. అంతలో అన్ని అంచనాలను తారుమారు చేస్తూ కాబూల్ వేగంగా తాలిబన్ల వశమైంది. వారితో యాసినీ కుమ్మక్కు కావడం చూస్తే, ఆఫ్ఘన్ ప్రభుత్వం,  సైన్యంలోని లుకలుకలే ప్రభుత్వ శీఘ్ర పతనానికి మూల కారణమని తేలిపోతుంది. 

ఆఫ్గనిస్తాన్ : అమెరికా ఊహించిన దాని కంటే వేగంగా ఆఫ్గాన్ ను తాలిబన్లు కైవసం చేసుకోవడం వెనుక ఓ వ్యక్తి నమ్మకద్రోహం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.  ఇబ్బందుల్లో పడ్డ అధ్యక్షుడు  అష్రఫ్ ఘనీకి అత్యంత సన్నిహితుడు  మిర్వాయిస్ యాసినీయే ఆ వ్యక్తి అని తెలుస్తోంది. ఆయన తాలిబన్లను తీవ్రంగా విమర్శిస్తూ, ఘనీ వెంటే ఉంటూ చివరకు తాలిబన్లతో చేతులు కలపడంతో వారి దురాక్రమణకు వేగం పుంజుకుంది.

నిజానికి కాబూల్  అంత తేలిగ్గా తాలిబన్ల వశం కాదన్న తమ గూడచారి వర్గాల అంచనాలను నమ్మిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వేసవి విహారానికి సిద్ధమయ్యారు. అంతలో అన్ని అంచనాలను తారుమారు చేస్తూ కాబూల్ వేగంగా తాలిబన్ల వశమైంది. వారితో యాసినీ కుమ్మక్కు కావడం చూస్తే, ఆఫ్ఘన్ ప్రభుత్వం,  సైన్యంలోని లుకలుకలే ప్రభుత్వ శీఘ్ర పతనానికి మూల కారణమని తేలిపోతుంది. 

కాబుల్ అతి తేలిగ్గా తాలిబన్ల పరం కావడంతో అమెరికా 3000 మంది సైనికులను హుటాహుటిన అక్కడికి పంపాల్సి వచ్చింది.  పార్లమెంట్ దిగువ సభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న  యాసీన్ తూర్పు నంగార్హర్ రాష్ట్రానికి ప్రతినిధి. పష్తూన్ తెగకు చెందినవారు.  ఇప్పుడు కాబూల్ బాధ్యతను తాలిబన్లు ఆయనకే అప్పగించారు. ఆఫ్ఘనిస్తాన్ భద్రత, సుస్థిరతలకు అతిపెద్ద ముప్పు పొంచి ఉందని నాలుగేళ్ల క్రితం ఆయన చెబుతూ వచ్చేవారు.

పదహారేళ్ళ వయసులోనే తుపాకీ పట్టిన ఆయన 1986లో ఉన్నత చదువులకు పాకిస్థాన్ వెళ్లారు. ఇస్లామాబాద్ లోని ఇస్లామిక్ అంతర్జాతీయ విశ్వ విద్యాలయం (ఐఐఐ యు)లో ఇస్లామిక్ న్యాయ శాస్త్రం, రాజనీతి శాస్త్రాల్లో పీజీ చేశారు.  1996-2001 మధ్య ఆఫ్ఘన్లో అధికారంలో ఉన్న తాలిబన్లపై పోరాటం జరిపి, వారి పతనం తర్వాత ప్రభుత్వంలో చేరి,  2005 వరకు ఉపమంత్రిగా ఉన్నారు. 

2009లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు తాలిబన్లను వ్యతిరేకించిన ఆయన ఏ పరిస్థితుల్లో ఇప్పుడు వారికి వంత పాడారనే విషయం మీద స్పష్టత లేదు. తాలిబన్లు మాత్రం ఆయనకు కీకల బాధ్యతలనే అప్పగించారు. రాజధాని కాబూల్ భద్రత వ్యవహారాలు ఆయన చేతిలో పెట్టినట్లు సమాచారం. అఫ్గాన్ అధ్యక్షునిగా హమీర్ కర్జాయ్ ఉన్నప్పుడు ఆయనకూ విశ్వాసపాత్రునిగా యాసినీ ఉండేవాడు. 

click me!