ప్రియుడి మీద కోపాన్ని పిల్లిమీద చూపించింది.. చివరికి...

Published : Aug 24, 2021, 09:32 AM IST
ప్రియుడి మీద కోపాన్ని పిల్లిమీద చూపించింది.. చివరికి...

సారాంశం

క్రిస్టా థిసిల్ అనే 53 యేళ్ల మహిళ... తన బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో అతని పిల్లిని బోనుతో సహా నదిలో పడేసినట్లు సమాచారం. ఈ ఘటన రివర్ వుడ్ పార్క్ లో జరిగినట్లు తెలుస్తోంది. క్రిస్టాకు ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ తో వాగ్వాదం జరిగింది. 

న్యూయార్క్ : ఓ ప్రేమికురాలికి ప్రియుడిపై కోపం వచ్చింది. ఏం చేయాలో తెలీక.. మూగజీవిపై ఆ కోపాన్ని తీసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన న్యూయార్క్ లో వెలుగు చూసింది. 

క్రిస్టా థిసిల్ అనే 53 యేళ్ల మహిళ... తన బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో అతని పిల్లిని బోనుతో సహా నదిలో పడేసినట్లు సమాచారం. ఈ ఘటన రివర్ వుడ్ పార్క్ లో జరిగినట్లు తెలుస్తోంది. క్రిస్టాకు ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ తో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బాయ్ ఫ్రెండ్ పై తీవ్రంగా కోపం వచ్చింది. అతనిపై తన కోపాన్ని ప్రదర్శించడం కోసం ఆమె అతని పిల్లిపిల్లను చంపేయాలని నిర్ణయించుకుంది. 

ప్రియుడితో వాగ్వాదం, కోపంలో ఏం చేస్తుందో తెలీకనో..ఆవేశంలోనో.. ఆగ్రహంతో ఊగిపోయింది క్రిస్టీ అంతే అతనికిష్టమైన పెంపుడు పిల్లిని.. బోనులో ఉందని కూడా చూడకుండా.. బోనుతో పాటు నదిలోకి విసిరేసింది. 

ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రిస్టీని అదుపులోకి తీసుకున్నారు. పిల్లికోసం గాలించగా.. అప్పటికే దాన్ని ఎవరో కాపాడినట్లు తెలుస్తోంది. నీళ్లలో తడిసిముద్దైపోయిన పిల్లిని ఎవరో కాపాడారని, దాని శరీరం పూర్తిగా తడిసి ఉందని తెలిసింది.  

క్రిస్టీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే ఆమె మీద యానిమల్ క్రూయాల్టీ కేసు నమోదయ్యింది. ఆమె ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?