టిక్ టాక్ యాప్ కి మరో షాక్

By ramya NFirst Published Feb 28, 2019, 9:53 AM IST
Highlights

పాపులర్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కి అమెరికా షాక్ ఇచ్చింది. 

పాపులర్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కి అమెరికా షాక్ ఇచ్చింది. పదమూడేళ్ల లోపు చిన్నారుల డేటాను అక్రమంగా సేకరిస్తోందన్న కారణంగా టిక్‌టాక్‌ యాజమాన్యానికి ఫెడరల్‌ ట్రేడ్‌ ‍కమిషన్(ఎఫ్‌టీసీ)‌.. 5.7 మిలియన్‌ డాలర్ల(దాదాపు 40. 60 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది.

సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు.  గతంలో వచ్చిన డబ్ స్మాష్ లాగానే ఇది కూడా ఉంటుంది. కాకపోతే.. ఇది మరింత పాపులరిటీ సంపాదించుకుంది. 

అయితే.. ఈ యాప్ ద్వారా అశ్లీల చిత్రాలు, మత పరమైన విధ్వంసాలు, హింసను ప్రేరేపించేలా కొందరు టిక్ టాక్ లో వీడియోలను తయారు చేస్తున్నారనే కారణంతో ఇప్పటికే దీనిపై నిషేధం విధించాలని తమిళనాడు రాష్ట్రం కోరుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు అమెరికా మరో షాక్ ఇచ్చింది.

2018లో కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్‌.ఎల్‌వై(Musical.ly) అనే మరో యాప్‌ గ్రూపు టిక్‌టాక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తల్లిదండ్రుల అనుమతి లేకుండా పదమూడేళ్ల లోపు చిన్నారుల ఫొటోలు, పేర్లు తదితర వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచడం ద్వారా... టిక్‌టాక్‌ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. ఈ మేరకు బుధవారం భారీ జరిమానా విధించింది.

click me!