అనారోగ్యంతో మాజీ పోప్ బెనెడిక్ట్ XVI మృతి..

By team teluguFirst Published Dec 31, 2022, 4:56 PM IST
Highlights

కాథలిక్ చర్చి మాజీ పోప్ బెనెడిక్ట్ అనారోగ్యంతో తన 95 వయస్సులో శనివారం చనిపోయారు. ఈ విషయాన్ని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ ప్రకటించారు. 

2005 నుండి 2013 వరకు కాథలిక్ చర్చి నాయకుడిగా పనిచేసిన పోప్ బెనెడిక్ట్  XVI అనారోగ్యంతో మరణించారు. ప్రస్తుతం ఆయనకు 95 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన మరణాన్ని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ ప్రకటించారు. “ పోప్ ఎమెరిటస్ బెనెడిక్ట్ XVI ఈ రోజు వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో 9.34 గంటలకు కన్నుమూశారని విచారంతో మీకు తెలియజేస్తున్నాను. మరింత సమాచారం వీలైనంత త్వరగా అందించబడుతుంది. ” అని ఆయన ట్వీట్ చేశారు.

బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతోందంటూ కర్నాటకలో మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య.. ఇరకాటంలో అధికార బీజేపీ

బెనెడిక్ట్  అనారోగ్యంతో బాధపడుతున్నారని పోప్ ఫ్రాన్సిస్ డిసెంబర్ 28న తన వారపు సమావేశం సందర్భంగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన మూడు రోజుల వ్యవధిలోనే ఆయన మరణించారు. బెనెడిక్ట్ 1927లో జర్మనీలో జోసెఫ్ అలోసియస్ రాట్‌జింగర్‌గా జన్మించారు. ఆయన 2005 నుంచి 2013 వరకు దాదాపు 8 సంవత్సరాల పాటు కాథలిక్ చర్చి నాయకుడిగా పని చేశారు. అయితే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 2015లో రాజీనామా చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రచురితమైన జర్మన్ పరిశోధన ఫలితాలు ప్రకారం.. బెనెడిక్ట్ మ్యూనిచ్ ఆర్చ్ బిషప్‌గా ఉన్నప్పుడు బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పూజారులపై చర్య తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది.

కరోనా గణాంకాలను దాచకుండా ప్రపంచంతో పంచుకోండి.. చైనాను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ

మాజీ పోప్ తండ్రి ఒక పోలీసు అధికారి. ఆయన గ్రామీణ ప్రాంతమైన బవేరియాలో పెరిగాడు. 14 సంవత్సరాల వయస్సులో హిట్లర్ యూత్‌లో చేరాడు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ సైన్యంలో పనిచేశాడు. అయితే యుద్ధం ముగిసే సమయానికి సైన్యం నుంచి వైదొలిగారు. అయితే అమెరికన్ దళాల చేతిలో బంధీ అయి కొంత కాలం యుద్ధ ఖైదీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన వాటికన్‌లో ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. కార్డినల్ రాట్‌జింగర్‌గా పోప్ జాన్ పాల్ IIకి రైట్ హ్యాంగ్ గా ఉన్నారు.

పుతిన్ విమర్శకుడైన మరో రష్యా పౌరుడు ఒడిశాలో మిస్సింగ్.. పెరుగుతున్న అనుమానాలు

అయితే ఆయన పోప్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మతాధికారుల లైంగిక వేధింపుల ఆరోపణలు, దానిని కప్పిపుచ్చడం ప్రారంభమైంది. ఆయన ఏప్రిల్ 2005లో పోప్‌గా ఎన్నికైన చాలా సంవత్సరాల తర్వాత పీక్స్ చేరుకున్న నేరాల తీవ్రతను, సంక్షోభం స్థాయిని గ్రహించడంలో ఆయన విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. 

click me!