హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా మృతి..

By SumaBala Bukka  |  First Published Feb 7, 2024, 8:45 AM IST

హెలికాప్టర్ ప్రమాదం మరో రాజకీయనాయకుడిని బలి తీసుకుంది. చిలీలో జరిగిన ఈ ప్రమాదంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు మృతి చెందాడు. 


శాంటియాగో : చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా మంగళవారం ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, మాజీ అధ్యక్షుడి కార్యాలయం ధృవీకరించింది. పినేరా రెండు పర్యాయాలు దేశాధ్యక్షుడిగా పనిచేశారు. 2010 నుండి 2014 వరకు, 2018 నుండి 2022 వరకు పదవిలో ఉన్నారాయన. 74 ఏళ్ల మాజీ అధ్యక్షుడి ఈ విషాదకర మరణాన్ని అంతర్గత మంత్రి కరోలినా తోహా ధృవీకరించారు.

దక్షిణ పట్టణం లాగో రాంకోలో హెలికాప్టర్ ప్రమాదంలో మరో ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పినెరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తోహా తెలిపారు. పినెరా దేశాధ్యక్షుడు కాకముందు విజయవంతమైన వ్యాపారవేత్త. ఆయన మొదటి సారి అధ్యక్షుడిగా మారిన2010 నుండి 2014 పదవి కాలంలో దేశంలో ఆర్థిక వృద్ధిని సాధించడంలో విజయం సాధించారు. ఆయన పదవీ కాలంలో నిరుద్యోగం కూడా బాగా తగ్గింది. 

Latest Videos

undefined

Foldable House : ఈ ఇంటిని మడతపెట్టొచ్చు.. అమెజాన్‌లో సేల్‌కి, ధర ఎంతంటే..?

కానీ, ఆ తరువాత 2018 నుండి 2022 వరకు రెండోసారి అధ్యక్షుడిగా చేసిన పదవీ కాలంలో అసమానతకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు దారితీశాయి. ఇవన్నీ  కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ముగిశాయి. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో పినెరా అధికారంలో ఉన్నారు. దేశంలో కోవిడ్ 19 కట్టడిలో సమర్థంగా పనిచేశారు. ఆ సమయంలో ప్రవేశపెట్టిన టీకా  ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టీకాగా గుర్తించబడింది. 

మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత 2010లో అటాకామా ఎడారిలో చిక్కుకున్న 33 మంది మైనర్‌లను రక్షించడం ఆయన పాలనలో తరచుగా గుర్తు చేసుకునే అద్భుతమైన ఘటనల్లో ఒకటి. ఆ సమయంలో ఈ సంఘటన గ్లోబల్ మీడియా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంతోనే 2014లో"ది 33" అనే సినిమా తీశారు. 

సెబాస్టియన్ పినెరా ప్రముఖ రాజకీయవేత్త కుమారుడు, హార్వర్డ్ లో-శిక్షణ పొందిన ఆర్థికవేత్త. ఆయన 1980లలో చిలీకి క్రెడిట్ కార్డ్‌లను పరిచయం చేశారు. అతని ప్రభుత్వ ఆర్థిక రికార్డుకు ప్రశంసలు ఉన్నప్పటికీ, దేశంలోని విద్యా వ్యవస్థలో లోతైన  అసమానతలను పరిష్కరించడానికి అతను తగినంతగా కృషి చేయలేదని చాలా మంది భావిస్తారు. సెబాస్టియన్ పినెరా భార్య సిసిలియా మోరెల్‌, అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు.
 

click me!