షార్ట్ కట్ దారి కోసం.. ప్రపంచ వింతైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు..

By Asianet News  |  First Published Sep 7, 2023, 4:53 PM IST

షార్ట్ కట్ అవుతుందని భావించి ఇద్దరు వ్యక్తులు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు కన్నం పెట్టారు. వాహనాలు వెళ్లేందుకు సరిపోయే దారిని చేశారు. అయితే విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిద్దరిని అరెస్టు చేశారు.


ప్రపంచ వింతలో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు ఇద్దరు వ్యక్తులు కన్నం పెట్టారు. కేవలం షార్ట్ కట్ అవుతుందని ఎంతో ప్రసిద్ధ నిర్మాణాన్నే కూల్చేశారు. దాని కోసం ఎక్స్కవేటర్స్ ను ఉపయోగించారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో వారద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ జంట చేసిన చర్యతో సెంట్రల్ షాంక్సీ ప్రావిన్స్ లోని ప్రసిద్ధ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలోని కొంత భాగం తొలగిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ 32వ గ్రేట్ వాల్ సమీపంలో ఓ నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను సొంతం చేసుకున్నారు. అయితే నిర్మాణ పనులకు వాహనాలను తీసుకెళ్లడం, మెటీరియల్ ను తీసుకెళ్లడం వారికి కష్టంగా మారింది. అయితే గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు కన్నం పెడితే చాలా షార్ట్ కట్ అవుతుందని వారు భావించారు. ఇంకేముందు ఎక్స్కవేటర్స్ ను ఉపయోగించి దానిని కూల్చేశారు. వాహనాలు వెళ్లేందుకు వీలుగా అవసరమైన దారి చేశారు. కాగా.. ఆగస్టు 24న ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారికి అక్కడి చట్టాల ప్రకారం శిక్ష పడే అవకాశం ఉంది.

Workers ploughed through a section of the Great Wall of China to create a shortcut. pic.twitter.com/uFZZlOsANS

— South China Morning Post (@SCMPNews)

Latest Videos

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 13,000 మైళ్ళకు పైగా విస్తరించి ఉండి.. ప్రపంచంలోని అత్యంత పురాతన నిర్మాణ అద్భుతాలలో ఒకటిగా నిలిచింది. ఈ కట్టడాన్ని 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. క్రీస్తుపూర్వం 200 నుండి 1600 లలో మింగ్ రాజవంశం వరకు దీనిని నిర్మించారు. ఇది గంభీరమైన, విస్తారమైన పురాతన సరిహద్దు శైలికి ప్రసిద్ధి చెందింది. ఈ కట్టడం పురాతన చైనీయుల రాజకీయ, వ్యూహాత్మక, ఆలోచన, సైనిక శక్తికి చిహ్నంగా మిగిలిపోయింది.

ఏదేమైనప్పటికీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా విధ్వంసం అసాధారణమేమీ కాదు. ఎందుకంటే ఇప్పటికే ఈ నిర్మాణంలోని అనేక భాగాలు కూలిపోయాయి. అదృశ్యమయ్యాయి. 2016 లో ఒక నివేదిక ప్రకారం.. ఈ గ్రేట్ వాల్ 30 శాతానికి పైగా పూర్తిగా అదృశ్యమైంది. ఇందులో 8 శాతం మాత్రమే సంరక్షించబడుతోంది. ఈ నిర్మాణంలోని పురాతన భాగాలు ఇప్పుడు గుట్టలుగా కనిపిస్తున్నాయి. దానిని గ్రేట్ వాల్ ఆఫ్ చైనాగా తొందరగా గుర్తించే అవకాశం లేదు.

దీంతో పాటు చాలా మంది స్థానికులు ఈ గోడలకు ప్రైవేట్ మందిరాలను నిర్మించారు. దానికి రంధ్రాలు తవ్వారు. తోటలకు కంచెలు, గొర్రెలకు కొట్టాలను నిర్మించేందుకు ఈ గోడ రాళ్లను ఉపయోగించారు. చాలా మంది స్థానిక రైతులు ఈ గోడ ఇటుకలు, రాళ్లను దొంగలించి ఇంటి నిర్మాణానికి, జంతువులకు ఆవాసాలు నిర్మించడానికి ఉపయోగించారు. ఇవి కూడా ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా క్షీణించిపోవడానికి కారణాలుగా అధికారుుల భావిస్తున్నారు.

click me!