Tokyo: మన సౌర వ్యవస్థలో భూమిని పోలీన మరో గ్రహం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మిస్టీరియస్ గ్రహం సౌర వ్యవస్థలోని నెప్ట్యూన్ గ్రహం దాటిన ప్రాంతంలో ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహం సౌర వ్యవస్థకు దూరంగా ఉన్న కైపర్ బెల్ట్‌లో ఉందని చెబుతున్నారు. కైపర్ బెల్ట్ అనేది మరుగుజ్జు గ్రహాలు, గ్రహశకలాలు, కార్బన్ ద్రవ్యరాశి, మీథేన్, అమ్మోనియా వంటి మంచుతో కూడిన అస్థిర మూలకాల వంటి నక్షత్రాల వస్తువులతో కూడిన భారీ రింగ్.
An Earth-like planet in the solar system: ఈ అనంత విశ్వంలో ఇప్పటికీ ఛేధించని అనేక విషయాలు ఉన్నాయి. నిత్యం మనిషి కొత్త విషయాలను కనుకొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఈ విశ్వంలో మానవ నివాసయోగ్యమైన గ్రహం కోసం చాలా సంవత్సరాల నుంచి అన్వేషణ, పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతిరోజూ రకరకాల ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, సౌర కుటుంబంలో భూమి లాంటి గ్రహం ఉన్నట్లు ఇటీవల ఖగోళ సంఘటనలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు ఆధారాలు కనుగొన్నారు. సౌరకుటుంబంలోని నెప్ట్యూన్ గ్రహం మీదుగా ఈ గ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌరకుటుంబానికి సుదూర అంచులైన కైపర్ బెల్ట్ లో ఈ గ్రహం ఉందని జపాన్ నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్రవ్యరాశి భూమి కంటే 1.5 నుంచి 3 రెట్లు ఉంటుందనీ, దాని వంపు 30 డిగ్రీలు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
సంబంధిత రిపోర్టుల ప్రకారం.. నెప్ట్యూన్ వెనుక భూమిలాంటి ప్లానెట్ నైన్ మన సౌర కుటుంబంలో దాగి ఉందని జపాన్ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్లూటోను 2006లో మరుగుజ్జు గ్రహంగా ప్రకటించిన తర్వాత 'ప్లానెట్ నైన్' అని పిలువబడే దాని ఉనికిపై కొనసాగుతున్న చర్చల మధ్య ఆస్ట్రోనామికల్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం పేర్కొంది. జపాన్ లోని ఒసాకాలోని కిండాయ్ విశ్వవిద్యాలయానికి చెందిన సోఫియా లైకావ్కా, జపాన్ నేషనల్ ఆస్ట్రానమీ అబ్జర్వేటరీకి చెందిన తకాషి ఇటో పరిశోధకులు నెప్ట్యూన్ కక్ష్యకు వెలుపల విస్తరించిన డోనట్ ఆకారంలో ఉన్న వలయమైన కుయిపర్ బెల్ట్ లో భూమి లాంటి గ్రహం ఉనికిని కనుగొన్నారు. కుయిపర్ బెల్ట్ అనేది మరుగుజ్జు గ్రహాలు, గ్రహశకలాలు, కార్బన్ ద్రవ్యరాశి, మీథేన్, అమ్మోనియా వంటి మంచు అస్థిర మూలకాలతో కూడిన ఒక భారీ వలయం.
భూమి లాంటి గ్రహాల ఉనికిని అంచనా వేస్తున్నామని పరిశోధకులు తెలిపారు. సౌరకుటుంబం ప్రారంభంలో చాలా గ్రహాలు ఉన్నందున సుదూర కుయిపర్ బెల్ట్ లో కేబీపీగా ఆదిమ గ్రహ శరీరం మనుగడ సాగించే అవకాశం ఉంది. ప్లానెట్ నైన్ ద్రవ్యరాశి భూమి కంటే 1.5 నుంచి 3 రెట్లు, సూర్యుడికి 500 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో ఉందని అభిప్రాయపడ్డారు. కుయిపర్ బెల్ట్ లో మిలియన్ల కొద్దీ ఘనీభవించిన వస్తువులు కూడా ఉన్నాయి, వీటిని నెప్ట్యూన్ వెలుపల ఉన్నందున ట్రాన్స్-నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ (టిఎన్ఓలు) అని పిలుస్తారు. టీఎన్ఓలు సౌర వ్యవస్థ నిర్మాణ అవశేషాలుగా నమ్ముతారు. రాతి, రూపాంతర కార్బన్, నీరు, మీథేన్ వంటి అస్థిర మంచు మిశ్రమాలను కలిగి ఉంటాయి. "సుదూర-వంగి ఉన్న కక్ష్యలో ఉన్న భూమి లాంటి గ్రహం సుదూర క్యూపర్ బెల్ట్ మూడు ప్రాథమిక లక్షణాలను వివరించగలదని మేము నిర్ధారించామని పరిశోధకులు పేర్కొన్నారు.