కేవలం రెండు గంటల్లో న్యూయార్క్ నుంచి లండన్‌కు..!

Published : Jul 03, 2018, 10:17 AM IST
కేవలం రెండు గంటల్లో న్యూయార్క్ నుంచి లండన్‌కు..!

సారాంశం

న్యూయార్క్ నుంచి లండన్‌కు రెండు గంటల్లో తీసుకువెళ్తామని చెబుతోంది ఓ ప్రముఖ విమానాల తయారీ కంపెనీ. నమ్మసఖ్యం కాకపోయినా, ఇది సాధ్యమే అంటోంది బోయింగ్ కంపెనీ.

న్యూయార్క్ నుంచి లండన్‌కు రెండు గంటల్లో తీసుకువెళ్తామని చెబుతోంది ఓ ప్రముఖ విమానాల తయారీ కంపెనీ. నమ్మసక్యం కాకపోయినా, ఇది సాధ్యమే అంటోంది బోయింగ్ కంపెనీ. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమాన తయారీ సంస్థ అయిన బోయింగ్‌ ధ్వని (శబ్ధం) కంటే అయిదు రెట్లు వేగంగా ప్రయాణించే ఓ హైపర్‌సోనిక్‌ విమానాన్ని తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ హైపర్‌సోమనిక్ విమానం గంటకు 3,800 మైళ్ల వేగంతో ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.

న్యూయార్క్‌ నుంచి లండన్‌‌కు మధ్య వాయు మార్గ దూరం 5585 కిలోమీటర్లు. గంటకు 901 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే న్యూయార్క్ నుంచి లండన్‌కు పట్టే సమయం 6 గంటల 20 నిమిషాలు. కానీ ఈ గమ్యాన్ని కేవలం 120 నిమిషాల వ్యవధి (రెండు గంట)ల్లోనే చేరుకోవచ్చని చెబుతోంది బోయింగ్ కంపెనీ.

అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ వార్షిక సదస్సులో భాగంగా బోయింగ్‌ సంస్థ తమ ఫ్యూచర్ ప్లాన్ గురించి ప్రకటించింది. ప్రస్తుతం ఈ హైపర్‌సోనిక్ విమాన తయారీకి సంబంధించిన ప్రణాళికలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ విమానం వాడుకలోకి రావడానికి మరో 20-30 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే
20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..