Donald Trump కు త్రుటిలో తప్పిన ముప్పు.. విమానం అత్యవసర ల్యాండింగ్​!

Published : Mar 11, 2022, 04:52 AM IST
Donald Trump కు త్రుటిలో తప్పిన ముప్పు.. విమానం అత్యవసర ల్యాండింగ్​!

సారాంశం

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌ల్లెత‌డంతో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని న్యూ ఓర్లీన్స్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ ఘ‌ట‌న గత‌వార‌మే జ‌రిగిన‌ప్ప‌టికీ ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది.    

 

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌ల్లెత‌డంతో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని న్యూ ఓర్లీన్స్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ ఘ‌ట‌న గత‌వార‌మే జ‌రిగిన‌ప్ప‌టికీ ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కు త్రుటిలో పెను ప్రమాదం త‌ప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న విమానం ఇంజిన్​లో లోపం వల్ల న్యూ ఓర్లియాన్స్​లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన‌ట్టు స‌మాచారం. మెక్సికో మీదుగా ప్రయాణిస్తున్న త‌రుణంలో ఇంజిన్​ పనిచేయటం ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా న్యూ ఓర్లియన్స్​లో ల్యాండ్ చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన గతవారం జరిగినప్పటికీ విషయం తాజాగా బయటకు వచ్చింది. 
 
ట్రంప్​ ప్రయాణిస్తున్న డస్సాల్ట్ ఫాల్కన్ 900 విమానం లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌ల్లెత‌డం వ‌ల్ల అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని పొలిటికో అనే వార్తా సంస్థ ముందుగా ప్రచురించింది. న్యూ ఓర్లీన్స్ విమానాశ్రయం నుండి 75 మైళ్లు (120 కి.మీ) దూరంలో ల్యాండ్ అయిన‌ట్టు  తెలిపింది. . ఈ ప్ర‌యాణ స‌మ‌యంలో ఆయ‌న‌తో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, సహాయక సిబ్బంది, ట్రంప్ సలహాదారులు ఉన్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారి సైతం ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను భద్రతా కారణాల రీత్యా వెల్లడించలేదు. 

న్యూ ఓర్లియాన్స్​లో గత శనివారం జరిగిన రిపబ్లికన్​ నేషనల్​ కమిటీ డోనార్​ రిట్రీట్​కు హాజరై.. తిరిగి ఫ్లోరిడా ఎస్టేట్​కు వస్తున్న క్రమంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంజిన్​ఆగిపోయింది. న్యూ ఓర్లియన్స్​ లేక్​ఫ్రంట్​ ఎయిర్​పోర్ట్​ నుంచి బయలు దేరిన సుమారు 120 కిలోమీటర్లు గగనతంలో ప్రయాణించిన తరువాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఒక ఇంజిన్ మెురాయించింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే