Assembly Election Results 2022: కాంగ్రెస్ లో అసమ్మతి స్వరాన్ని పెంచనున్న జీ-23 నేతలు

Published : Mar 10, 2022, 02:17 PM IST
Assembly Election Results 2022:  కాంగ్రెస్ లో అసమ్మతి స్వరాన్ని పెంచనున్న జీ-23 నేతలు

సారాంశం

తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలు తమ స్వరాన్ని పెంచేందుకు దోహదపడే అవకాశాలు లేకపోలేదు. జీ 23 నేతలు పార్టీ నాయకత్వంపై తమ గళాన్ని పెంచే చాన్స్ ఉంది.

న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు Congress  పార్టీలో అసమ్మతి నేతలు తమ స్వరాన్ని పెంచే అవకాశం ఉంది. జీ-23 గా ముద్ర పడిన నేతలు పార్టీ  నాయకత్వంపై తమ  డిమాండ్లను నెరవేర్చాలని  కోరే  అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలు పార్టీ అధినేత్రి Sonia Gandhi కి 2020 ఆగష్టులో లేఖ రాశారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలను ఈ లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విసయమై అసమ్మతి స్వరం విన్పించిన నేతలతో కూడా సోనియాగాంధీ సహా పార్టీ నేతలు చర్చించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ విషయమై చర్చించారు.

అసమ్మతి స్వరం విన్పించిన నేతల తీరును  మాజీ ప్రధాని Manmohan Singh  సహా కొందరు నేతలు తీవ్రంగా తప్పు బట్టారు.  CWC  సమావేశంలో ఈ విషయమై అసమ్మతి నేతల తీరును తప్పబుట్టారు. BJP ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చారని మరికొందరు నేతలు కూడా అసమ్మతిపై విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో జీ-23 నేతలుగా Gulam nabi Azad, కపిల్ సిబల్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ, పీజే కురియన్, రేణుకా చౌదరి, మిలింద్ దేవరా, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద్, భూపేంద్ర సింగ్ హుడా, రాజేందర్ కౌర్ భట్టాల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చౌహాన్, అజయ్ సింగ్, రాజ్ బబ్బర్, అరవింద్ సింగ్ లవ్లీ, కౌల్ సింగ్ ఠాకూర్, కుల్దీప్ శర్మ, యోగానంద్ శాస్త్రి, సందీప్ దీక్షిత్, వివేక్ తంఖా ముద్ర పడ్డారు. అసమ్మతి నేతలు తమ గళాన్ని లేవనెత్తిన తర్వాత బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. తమిళనాడులో  DMK తో పొత్తు  ఆ పార్టీకి కలిసి వచ్చింది. 

ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో Punjab రాష్ట్రంలో అధికారానికి బీజేపీ దూరమైంది. ఐదు రాష్ట్రాల్లో ఉన్న అధికారాన్ని పంజాబ్ లో కోల్పోయింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో అధికారానికి దూరంగా ఉంది. దీంతో అసమ్మతి నేతలు మరోసారి తమ స్వరాన్ని పెంచే అవకాశం లేకపోలేదు.

ఇదే ఏడాదిలో పార్టీ నుండి ఆశ్వనీకుమార్ వైదొలిగిన సమయంలో కూడా పార్టీ నాయకత్వం ఇప్పటికే తాము లేవనెత్తిన అంశాలపై చర్చించాలని కూడా డిమాండ్ చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించారు. అయితే  సంస్థాగత ఎన్నికల్లో అసమ్మతి నేతలు తమ డిమాండ్లు నెరవేరే విధంగా వ్యవహించేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్టీని కాపాడుకొనేందుకే తాము ప్రయత్నిస్తున్నామని కూడా అసమ్మతి నేతలు చెబుతున్నారు.అందివచ్చిన అవకాశాలను కూడా పార్టీ నాయకత్వం అందింపుచ్చుకోవడం లేదు. ఆయా రాష్ట్రాల్లో  పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వంటి పరిణామాలు కూడా పార్టీ ఓటమికి కారణాలుగా చెబుతున్నారు. మరో వైపు క్షేత్ర స్థాయిలో పనిచేసే వారి కంటే లాబీయింగ్ చేసే నేతలకు పట్టం కట్టడం కూడా పార్టీకి వ్యతిరేకమైన పలితాలు వచ్చేలా చేస్తున్నాయి.

మరో వైపు ప్రత్యర్ధి పార్టీల బలాలు, బలహీనతలను ఎప్పటి కప్పుడూ సమీక్షించుకొంటూ అందుకు అనుగుణంగా వ్యూహాలు అమలు చేస్తే సరైన ఫలితాలు దక్కుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలకు అందుబాటులో ఉండేవారు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండే పరిస్థితి కూడా లేదు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవిలో సోనియా గాంధీ ఉన్నారు. సంస్థాగత ఎన్నికల్లో పార్టీని సమర్ధవంతంగా నడిపించే నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే  భవిష్యత్తులో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయి. సంస్థాగత ఎన్నికల కోసం జీ 23 నేతలు చూస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే