షాపింగ్ మాల్ పై కూలిన విమానం..ఐదుగురు మృతి

First Published 6, Aug 2018, 12:11 PM IST
Highlights

రెండు ఇంజన్లు గల చిన్న విమానం కూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించినట్లు తెలిపారు. విమానం పార్కింగ్‌లో ఉన్న ఓ కారును ఢీకొట్టిందని, కానీ ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

షాపింగ్ మాల్ లోని పార్కింగ్ లో ఓ విమానం కూలి..ఐదుగురు మృతిచెందిన సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శాంటా అనా నగరంలోని స్టాప్లెస్‌ సూపర్‌సెంటర్‌ షాపింగ్‌ మాల్‌ పార్కింగ్‌ ప్రాంతంలో విమానం కూలిందని అధికారులు వెల్లడించారు. 

రెండు ఇంజన్లు గల చిన్న విమానం కూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించినట్లు తెలిపారు. విమానం పార్కింగ్‌లో ఉన్న ఓ కారును ఢీకొట్టిందని, కానీ ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

విమానం శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని ఓ కంపెనీ పేరిట రిజిస్టరై ఉంది. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) వెల్లడించిన వివరాల ప్రకారం విమానం కాంకోర్డ్‌ సిటీ ఈస్ట్‌ బే సబర్బ్‌ నుంచి బయలుదేరి ఆరెంజ్‌ కౌంటీలోని జాన్‌ వేన్‌ విమానాశ్రయానికి సమీపంలోని షాపింగ్‌ మాల్‌ వద్ద కూలింది. 

పైలట్‌ ఎమర్జెన్పీ ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పటికీ విమానం క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఘటనపై ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టింది. జాతీయ రవాణా భద్రత సంస్థ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిందని అధికారులు తెలిపారు.
 

Last Updated 6, Aug 2018, 12:11 PM IST