ఇండోనేషియాలో భూకంపం: 82 మంది మృతి

First Published 6, Aug 2018, 7:30 AM IST
Highlights

ఇండోనేషియాను భారీ భూకంపం తాకింది. లాంబాక్‌ ద్వీపంలో 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దాని వల్ల 82 మంది మరణించారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.

జకార్తా: ఇండోనేషియాను భారీ భూకంపం తాకింది. లాంబాక్‌ ద్వీపంలో 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దాని వల్ల 82 మంది మరణించారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. 

భూకంపం15 కి.మీ లోతులో కేంద్రీకృతమైనట్లు అమెరికా జియలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం తర్వాత రెండు సార్లు కాస్తా తక్కవ స్థాయిలో భూకంపాలు వచ్చాయి. దాదాపు 25 ప్రకంపనలు వచ్చాయి. అధికారులు తొలుత సునామీ హెచ్చరిక జారీ చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. 

ఈ భూకంపం తీవ్రతకు దాదాపు 900 కి.మీ దూరంలోని బాండుంగ్‌ నగరంలోనూ నష్టం వాటిల్లింది. బాలి ద్వీపంలో భూకంపం తీవ్రత ఎక్కువగా కనిపించింది. వారం రోజుల క్రితమే లాంబాక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చి 17 మంది మరణించారు. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Last Updated 6, Aug 2018, 7:30 AM IST