కరోనా వైరస్ వ్యాప్తి: ముక్కు, గొంతుతోపాటు తాజాగా చెవుల నుండి కూడా..?

By Sreeharsha GopaganiFirst Published Jul 25, 2020, 5:49 PM IST
Highlights

కరోనా ద్వారా మరణించిన రోగుల్లోని చెవుల్లో ఈ వైరస్ ని గుర్తించారు వైద్యులు. జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ పరిశోధకులు ముగ్గురుపై చేసిన ఒక చిన్న అధ్యయనంలో, ఇద్దరికి మధ్య చెవుల్లోనే కాకుండా వెనుక చెవిలో కూడా అధిక వైరల్ లోడ్లు ఉ‍న‍్నట్టు గుర్తించారు.

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతుంది. తొలుత ఇది ముక్కు, మూతి ద్వారా మాత్రమే మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది అని అన్నారు. కొన్ని రోజుల కింద కంటి ద్వారా కూడా వైరస్ మనిషి లోపలి ప్రవేశిస్తుందని తెలిపారు. ఇప్పుడు తాజా గా చెవుల్లో కూడా కరోనా వైరస్ ని గుర్తించారు శాస్త్రవేత్తలు. 

కరోనా ద్వారా మరణించిన రోగుల్లోని చెవుల్లో ఈ వైరస్ ని గుర్తించారు వైద్యులు. జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ పరిశోధకులు ముగ్గురుపై చేసిన ఒక చిన్న అధ్యయనంలో, ఇద్దరికి మధ్య చెవుల్లోనే కాకుండా వెనుక చెవిలో కూడా అధిక వైరల్ లోడ్లు ఉ‍న‍్నట్టు గుర్తించారు. ఒక మహిళకు కుడి చెవి మధ్యభాగంలో మాత్రమే వైరస్ రాగా, 60 ఏళ్ల వ్యక్తికి ఎడమ, కుడి కర్ణబేరిలోనూ, ఎడమ,కుడి చెవుల మధ్యభాగంలోనూ వైరస్‌ ను గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. 

అయితే వైరస్ చెవుల గుండా మనిషి శరీరంలోకి సోకిందా, లేదా శరీరంలో వైరల్ లోడ్ ఎక్కువయ్యాక అది చెవుల్లోకి చేరిందా అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు వైద్యులు. చెవుల్లోకి కూడా వైరస్ చేరుతుండడంతో చెవి వినికిడి శక్తి తగ్గుతుందని, ఇది కూడా కరోనా లక్షణమేనని అన్నారు పరిశోధకులు. 

click me!