ఆపద్బాంధవుడు... ఇండియాకు రష్యా మరోసారి ఆపన్నహస్తం

By Siva KodatiFirst Published Apr 23, 2021, 9:22 PM IST
Highlights

చిరకాల మిత్ర దేశం రష్యా స్పందించింది. భారత్‌కు మెడికల్ ఆక్సిజన్, రెమ్‌డిసివర్‌ రెండింటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వచ్చే 15 రోజుల్లోనే వాటిని భారత్‌కు పంపాలని మాస్కో నిర్ణయించినట్టు సమాచారం

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.

వరుసగా రెండో 3 లక్షలకు పైగా కేసులు , 2 వేలకు పైగా మరణాలతో భారతావని వణికిపోతోంది. మరోవైపు ఆసుపత్రుల్లో చేరిన రోగులకు మెడికల్ ఆక్సిజన్, యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.

వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున తయారు చేయాలని ఇప్పటికే సీరమ్, భారత్ బయోటెక్‌లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి అవసరమైన ఆర్ధిక సాయాన్ని కూడా కేంద్రం ప్రకటించింది. 

Also Read:ఇండియాలో రికార్డులు తిరగరాస్తున్న కరోనా కేసులు:24 గంటల్లో 3.32 లక్షల కేసులు, 2256 మంది మృతి

ఈ నేపథ్యంలో చిరకాల మిత్ర దేశం రష్యా స్పందించింది. భారత్‌కు మెడికల్ ఆక్సిజన్, రెమ్‌డిసివర్‌ రెండింటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వచ్చే 15 రోజుల్లోనే వాటిని భారత్‌కు పంపాలని మాస్కో నిర్ణయించినట్టు సమాచారం. 

వారానికి 3,00,000-4,00,000 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, అలాగే నౌక ద్వారా మెడికల్ ఆక్సిజన్‌ను పంపేందుకు రష్యా ముందుకొచ్చినట్టు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.

దేశంలో రెమ్‌డెసివిర్ డ్రగ్స్‌కు కొరత ఏర్పడడంతో భారత ప్రభుత్వం వాటి ఎగుమతులను ఇటీవల నిషేధించడంతో పాటు దిగుమతి సుంకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రజలపై మరింత భారం పడకుండా రెమ్‌డిసివర్ డ్రగ్ ధరను భారీగా తగ్గించింది. 
 

click me!