Japan Fire accident: భారీ అగ్నిప్రమాదం.. 27 మంది మృతి

By Mahesh RajamoniFirst Published Dec 17, 2021, 11:38 AM IST
Highlights

Fire accident: జ‌పాన్ లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభించింది.  జపనీస్ బ్రాడ్‌కాస్టర్ నిప్పన్ హోసో క్యోకై (NHK) మార్కెట్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలోని నాలుగో అంత‌స్తులో మంట‌లు చేల‌రేగడంతో మొత్తం 27 మంది చ‌నిపోయార‌ని అధికారులు వెల్ల‌డించారు. 
 

Fire accident :  జ‌పాన్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 27 మంది చ‌నిపోగా, ప‌లువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ఒసాకా నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారని అధికారులు వెల్ల‌డించారు.  జపనీస్ బ్రాడ్‌కాస్టర్ నిప్పన్ హోసో క్యోకై (NHK) మార్కెట్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలోని నాలుగో  అంతస్తులో శుక్రవారం  మంటలు చెలరేగాయని వెల్లడించింది. ఈ ఘటనలో 28 మంది చిక్కుకున్నారనీ, వారిలో 27 మంది గుండె ఆగిపోవడంతో మరణించారని స‌మాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని అధికారులు పేర్కొంటున్నారు.  అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేద‌ని చెప్పారు. అగ్ని ప్ర‌మాదం స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది అక్కడికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు.  అరగంటలో భవనంలో మంటలు అదుపులోకి వచ్చాయి. 

Also Read: CM KCR: కేంద్రంపై పోరు.. నేడు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

 

జపాన్‌లోని వాణిజ్య జిల్లాగా భావించే ఒసాకా నగరంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపింది. మంటల కారణంగా భవనంలో ఉన్న 27 మంది చనిపోయి ఉంటారని డిపార్ట్‌మెంట్ అధికారులు పేర్కొన్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో  మంటలు భవనం లోపల అత్యంత వేగంతో వ్యాపించాయన్నారు. ప్ర‌మాదం జ‌రిగిన భవనం ఎనిమిది అంతస్తులు ఉంటుంద‌నీ,  డజన్ల కొద్దీ అగ్నిమాపక సిబ్బంది భవనం లోపల, వెలుపల మంటలను ఆర్పివేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని తెలిపారు. అర‌గంట‌లోనే మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చామ‌ని తెలిపారు. జపాన్ స్థానిక మీడియ‌లో వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ప్ర‌స్తుతం ప్ర‌మాదం జ‌రిగ‌న అంతస్తులో ఒక క్లినిక్ ఉంది. ఇది ప్రజలకు మానసిక ఆరోగ్య సేవ..సాధారణ వైద్య సౌకర్యాలను అందిస్తుంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ప‌లువురు రోగులు, వారి బంధువులు ఉన్నారు. 

Also Read: omicron : భార‌త్‌లో సెంచరీకి చేరువలో ఒమిక్రాన్ కేసులు..

ఈ ప్ర‌మాదంపై ఒసాకా  అగ్నిమాపక విభాగానికివ‌ చెందిన అధికారి AFP వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ప్రమాద వివ‌రాలు వెల్ల‌డించారు. ఆయ‌న పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం..  మంటల్లో 28 మంది చిక్కుకున్నారు. వారిలో 27 మంది  ప్రాణాలు లోల్పోయారు. మిగిలిన ఒక్క‌రి ప‌రిస్థితి కూడా ఆందోళ‌న‌క‌రంగానే ఉంది. ఆయ‌న బ‌తికే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉన్నాయి.  బాధితులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.18 గంటలకు భవనంలోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం సమయానికి 70 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో మంట‌ల‌ను ఆర్పివేశాయి. ఒసాకా నగరంలోని కిటాషించి రైల్వే స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతంలో ఈ భ‌వ‌నం ఉంద‌ని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ప్ర‌మాదం కారంగా భారీగా పొగలు కమ్ముకున్నాయని అక్క‌డి స్థానికులు చెప్పారు. అలాగే, ఘాటైన వాసన కూడా వచ్చింద‌న్నారు.  కార్యాలయం, దవాఖానలో ఉన్న ఫర్నీచర్, ఇతర సామగ్రి కాలిపోవడంతో ఇలాంటి దుర్వాసన వస్తోందని భావిస్తున్నారు. దీనిపై పూర్త స్థాయి దర్యాప్తు ప్రారంభిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. 

Also Read: coronavirus updates: క‌రోనాకు డెన్మార్క్ సైంటిస్టుల కొత్త మందు!

click me!