కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 44 మంది మృతి, 67 మందికి గాయాలు

By telugu teamFirst Published Jul 13, 2021, 7:05 AM IST
Highlights

ఇరాక్ లోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 44 మంది మరణించగా, 67 మంది గాయపడ్డారు ప్రధాన మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

నసీరియా: ఇరాక్ లోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 44 మంది మరణించగా, 6 మంది దాకా గాయపడ్డారు ఇరాక్ లోని నసీరియా పట్టణంలో గల ఆల్ - హుస్సేన్ కోవిడ్ ఆస్పత్రిలో ఈ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. 

ఆస్పత్రిలో ఆవరణలోని ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో మంటలతో పాటు దట్టమైన పొగలు కూడా వ్యాపించాయి. దాంతో కోవిడ్ ఆస్పత్రిలో చిక్కుకున్న రోగులను బయటకు తీసుకుని రావడం కష్టంాగ మారింది. 

మరింత మంది మరణించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రధాన మంత్రి ముస్తఫా ఆల్ - కధిమి సీనియర్ మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. నసీరియాోలని ఆరోగ్య, సివిల్ డిఫెన్స్ మేనేజర్లను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

ఆస్పత్రి మేనేజర్ ను సస్పెండ్ చేశారు. మేనేజర్ ను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి.  గత ఏప్రిల్ లో కూడా ఓ కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది మరణించగా, 100 మంది గాయపడ్డారు. ఇరాక్ లో ఇప్పటి వరకు 14 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, 17 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు.

click me!