
వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. 90 నిమిషాల పాటు రోదసిలో ప్రయాణించి ఈ నౌక తిరిగి భూమిని చేరుకుంది. రోదసీలో ప్రయాణించిన నాలుగో భారతీయ వ్యోమగామిగా తెలుగమ్మాయి శిరీష బండ్ల రికార్డుల్లోకెక్కారు. అంతకుముందు గంటన్నర ఆలస్యంగా వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక నింగీలోకి దూసుకెళ్లింది. న్యూమెక్సికో నుంచి వీఎస్ఎస్ యూనిటీ-22 ప్రయోగం జరిగింది. ఈ వ్యోమనౌకలో తెలుగమ్మాయి శిరీష బండ్ల సహా ఆరుగురు వున్నారు. 90 నిమిషాల పాటు ఈ బృందం అంతరిక్షయానం చేశారు.
Also Read:అంతరిక్షయానంలో నూతన శకం: నింగిలోకి దూసుకెళ్లిన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష పేరేంట్స్ చాలా క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. ఈ వ్యోమ నౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు మరో అయిదుగురు ప్రయాణం చేశారు. ఇందులో శిరీష బండ్ల ఉన్నారు. ఈ యాత్రపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అంతకుముందు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ రోదసీలోకి వెళ్లారు.