అంతరిక్షయానంలో నూతన శకం: నింగిలోకి దూసుకెళ్లిన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక

By Siva KodatiFirst Published Jul 11, 2021, 8:39 PM IST
Highlights

రోదసిలోకి ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జరుపుతున్న ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన వీఎస్ఎస్ 22 వ్యోమనౌక అంతరిక్షంలోకి బయల్దేరింది. 
 

అంతరిక్షరంగంలో నూతన శకం ఆవిష్కృతమైంది. అమెరికన్ సంస్థ వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక విజయవంతంగా నింగీలోకి దూసుకెళ్లింది. న్యూమెక్సికో నుంచి నిర్థారిత షెడ్యూల్  కంటే గంటన్నర ఆలస్యంగా వీఎస్ఎస్ యూనిటీ-22 ప్రయోగం జరిగింది. ఈ వ్యోమనౌకలో తెలుగమ్మాయి శిరీష బండ్ల సహా ఆరుగురు వున్నారు. 90 నిమిషాల పాటు ఈ బృందం అంతరిక్షయానం చేయనుంది. 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష పేరేంట్స్ చాలా క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. శిరీష ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్  ఆదివారం నాడు మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ -22 ను వీఎంఎన్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుండి 15 వేల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్తుంది. అనంతరం అక్కడి నుండి  రాకెట్  యూనిటీ-22 ను మరింత ఎత్తుకు తీసుకెళ్తోంది.

ఈ వ్యోమ నౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు మరో అయిదుగురు ప్రయాణం చేయనున్నారు. ఇందులో శిరీష బండ్ల ఉన్నారు. ఈ యాత్రపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.ఈ అంతరిక్షయానం విజయవంతమైతే  అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష బండ్ల రికార్డు సృష్టించనున్నారు. అంతకుముందు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ రోదసీలోకి వెళ్లారు. 

click me!