జాన్సన్ టీకాతో అరుదైన సమస్య.. నరాలపై దాడి.. !!

By AN TeluguFirst Published Jul 13, 2021, 3:53 PM IST
Highlights

ఈ దుష్ప్రభావాన్ని గిలియన్-బారే సిండ్రోమ్  గా పేర్కొంటారని నిపుణులు తెలిపారు ఇప్పటివరకు అమెరికాలో 12.8 మిలియన్ల మందికి జాన్సన్ టీకా ఇవ్వగా ...100 కేసుల్లో ఈ దుష్ప్రభావం తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎఫ్ డీఏ తెలిపింది. 

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన సింగిల్ డోస్ టీకాకు మరోసారి చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ టీకా తీసుకున్నవారిలో చాలా అరుదుగా నరాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తున్నట్లు గుర్తించారు.  

ఈ నేపథ్యంలో ఈ టీకా వినియోగానికి సంబంధించిన అనుమతుల పత్రంలో హెచ్చరికను జోడిస్తున్నామని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్ డీఏ) సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ దుష్ప్రభావాన్ని గిలియన్-బారే సిండ్రోమ్  గా పేర్కొంటారని నిపుణులు తెలిపారు ఇప్పటివరకు అమెరికాలో 12.8 మిలియన్ల మందికి జాన్సన్ టీకా ఇవ్వగా ...100 కేసుల్లో ఈ దుష్ప్రభావం తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎఫ్ డీఏ తెలిపింది. వీరిలో 95 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది.

కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 44 మంది మృతి, 67 మందికి గాయాలు

ఒకరు మరణించినట్లు వెల్లడించింది. టీకా తీసుకున్న 42 రోజుల లోపు ఈ దుష్ప్రభావం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొంది. సాధారణంగా ఏటా సీజనల్ ఫ్లూ, పుండ్లకు సంబంధించిన టీకాలు తీసుకున్న వారిలో 3000నుంచి 6000 మందిలో గిలియన్-బారే సిండ్రోమ్ గుర్తిస్తామని ఎఫ్ డీఏ తెలిపింది. 

వీరిలో చాలామంది కోలుకుంటారని పేర్కొంది. దీనివల్ల కండరాల్లో బలహీనత తో మొదలై పక్షవాతం వరకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది. అయినప్పటికీ జాన్సన్ అండ్ జాన్సన్ సహా ఇతర కరోనా టీకాలను తీసుకోవడం మాత్రం మానొద్దని అమెరికా సీడీసీ స్పష్టం చేసింది. తాజాగా గుర్తించిన దుష్ప్రభావం చాలా అరుదని తెలిపింది. జాన్సన్ టీకా వల్ల తలెత్తే సమస్యలతో పోలిస్తే ప్రయోజనాలే అధికమని స్పష్టం చేసింది. 
 

click me!