కొడుకు, కోడలిపై ఓ తండ్రి ఎమోషనల్ పోస్ట్... నెట్టింట వైరల్..!

Published : Feb 13, 2023, 10:47 AM IST
 కొడుకు, కోడలిపై ఓ తండ్రి ఎమోషనల్ పోస్ట్... నెట్టింట వైరల్..!

సారాంశం

 ఓ వ్యక్తి  పెళ్లి రోజన తన కొడుకు, కోడలిపై ఉన్న ప్రేమను చూపించాడు. అతను షేర్ చేసిన వీడియో చూస్తే...ఎంతటివారికైనా కళ్లు చెమ్మగిలేస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టు వివరాలేంటో ఓసారి చూద్దాం...

ఈ ప్రపంచంలో మనపై ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమ చూపించగలిగేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. మన కోసం వారు ఏది చేయడానికైనా వెనకాడరు. మనల్ని సంతోషంగా ఉంచడానికి  ఏమైనా చేస్తారు. ఎంత మంది ముందైనా వారు మనపై వారికున్న ప్రేమను చూపించగలరు. కాగా.. తాజాగా ఓ వ్యక్తి  పెళ్లి రోజన తన కొడుకు, కోడలిపై ఉన్న ప్రేమను చూపించాడు. అతను షేర్ చేసిన వీడియో చూస్తే...ఎంతటివారికైనా కళ్లు చెమ్మగిలేస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టు వివరాలేంటో ఓసారి చూద్దాం...


ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చిన్న క్లిప్‌లో, ఒక వ్యక్తి తన కొడుకు , కోడలికి వారి పెళ్లి రోజున టోస్ట్ ఇచ్చారు. ఆ వ్యక్తి తన కుమారుడు మైఖేల్ జన్మించిన సమయం గురించి మాట్లాడాడు. ఆ సమయంలో.. కొంచెం భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత తన కోడలి పై కూడా ప్రశంసలు కురిపించాడు. "ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజులలో ఒకటి" అని చెడుతూ అతను ఎమోషనల్ అవ్వడం గమనార్హం.

కాగా... అతను ఎమోషనల్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుటోంది.  అతను ఎమోషన్  కి , అతని పోస్ట్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. తండ్రి ప్రేమ ఇలానే ఉంటుంది అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.


"నేను ఇలాంటివి చూసినప్పుడు నాకు ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే నా జీవితం ఎలా ఉండేదో అని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. వారు ఎంత అదృష్టవంతులో వారికి తెలుసని నేను ఆశిస్తున్నాను" అని ఒక నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే